పుట:Haindava-Swarajyamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండ్రెండవ ప్రకరణము.


భారత భూమిస్థితి.

వైద్యులు.

చదువరి: వకీళ్లనుగురించి నాకిప్పు డర్థమయినది. వారు చేసిన మేలు ఆకస్మికము కావచ్చును. ఆవృత్తి నీచమని నాకు తోచుచున్నది. మీరు వైద్యులను కూడ లాగి వైచుచున్నారే! అదిఎట్లు?


సంపా: నేను తమకు తెలుపునభిప్రాయములు నావికావు. నేనును అంగీకరించినవే. పాశ్చాత్య రచకులు న్యాయవాదులను గురించియు వైద్యులను గురించియు కఠినతరముగా వ్రాసినారు. అందులో నొక్కరు "నేటి నాగరక పద్ధతినంతయు ఉపాసవృక్షమునకు పోల్చినారు. పరోపజీవికలగువృత్తు లావృక్షమునకు శాఖలు. ఇందులో న్యాయవాది వృత్తి, వైద్య వృత్తి చేరియున్నవి. మొదలింటిమిద మశ్రమను గొడ్డలి పెట్టినారు. వేరుశాశ్వతత్వము. మీకు ఇందుమీదట అభిప్రాయమంతయు నాది కాదనుట సులభగ్రాహ్యయి. అనేకులేకమై యాలోచించినదనుటయు తెల్లమే. ఒకప్పుడు వైద్యవృత్తి యనిన నాకు బహు ప్రేమ. దేశముకొరకయి వైద్యుడు కావలయునని నాయుద్దేశముండినది. ఇప్పుడాయుద్దేశము నాకు లేదు. మనలోని నాటు వైద్యుల కేల గౌరవపదవి రాలేదో యిప్పుడు నాకర్థమయినది.