పుట:Gurujadalu.pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ఆంధ్రకవితాపిత -1 “ధరణి వడంకె, ధూళిదీవిదన్నిన భానుని గానరాదు.” 'కాటమరాజుకు కర్ణుడోడె

“నన్నయభట్టు ప్రథమాంధ్రకవియేనా?” అని ప్రశ్న వేసుకొని, మా మిత్రులు శ్రీ లక్ష్మణరావు గారు రెండు వ్యాసములు వ్రాసిరి. చదీవి సంతోషించినాను. వొకప్పుడు నేను కూడా నన్నయను గురించి విపులముగా రాయదలచి యుంటిని. మా మిత్రులు శ్రీ జయంతి రామయ్య పంతులు | గారు కూడా రాయదలచీరని విని, ఆగితిని. వారే రాసినచో, యితరులకు వ్రాయవలసినది అట్టే మిగిలియుండదని నా నమ్మకము.

కానీ, ఢంకా దెబ్ళ విన్న తరువాత యుద్ధంలో జొరకనిల్పడం కష్టం! ఫలితము రెండు తెగల వారివల్లనూ దెబ్బలు తినడమే కావచ్చును. అదీ ఒక ముచ్చటే!

లోకం పుట్టిన దగ్గరనుంచీ, లోకులు ప్రాణం పెట్టి దెబ్బలాడే అన్ని వివాదాంశములూ, కొంచెం నిదానించి చూస్తే, 'అవునూ- కాదూ', కూడా అని తేలుతవి. ఈ రహస్యమును మా మిత్రులు లక్ష్మణరావు గారు గ్రహించి నన్నయ వాదానికి తగిలించినారు. యిట్టి తీర్పులలో తేటతెల్లమైన మేరుగొకటి కలదు. నీజం యెటు ప్రక్కను వున్నా, మన ప్రక్కన కూడా వుండక తీరదు. మా మిత్రుల అభిప్రాయముతో నేను పూర్ణముగా యేకీభవింతును. గానీ వొకరు | అన్నమాటే మనం కూడా అనడం సొగసుకాదనీ తోచి, కొత్తమాట యేమైనా అందామని విశ్వప్రయత్నం చెయ్యగా, ఒకటి దైవవశాత్తు స్ఫురించినది.

అదీ యేమనగా, “నన్నయ ప్రథమాంధ్రకవి అవునన్న మాటా, కాదు. వాడన్నమాటా, కాదు. యిదీకాక అదీ కాకపోతే, అయినమాటేది? యేదా? చెవిఒగ్గి వినండి. “మనకు తెలియదన్నమాట!” దేనికైనా సందేహం వుండవచ్చును గానీ, దీనికి సందేహం వుండబోదు. యీ మట్టుకైనా తెలియడమన్నది సామాన్యమైన మాటకాదు. వెనుకటికి, గ్రీకులలో సొక్రెటీసనే పండితాగ్రేసరుడు వుండే వాడు. అతనికడకు పోయిమనబోట్లడిగిరట : “యేమయ్యా లోకానికల్లా నీవే మహా జ్ఞానీవని ఒక దేవత చెప్పినది. మాకన్న నీకు తెలిసిన దేమిటి? సోక్రటీసనేనట : “నాకు యేమీ తెలియదు. ఆ సంగతి మట్టుకు నాకు తెలుసును. మీకైతేనో, ఆ తెలియదన్న మాటా తెలియదు. అదే, నా ఆధిక్యత కావచ్చును.” ప్రథమంలో తీర్పు చెప్పి వేశాం గనుక, యిక ఆ తీర్పు నిలబెట్టుకోవడమునకు తగిన యుక్తులు కల్పించుకుందాము. | | గురుజాడలు 570 ఆంధ్రకవితాపిత - 1