పుట:Gurujadalu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకాశకుల మనవి

మనసు ఫౌండేషన్ పేరిట ఇంతవరకూ రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, శ్రీశ్రీ, బీనాదేవి గార్ల లభ్య రచనల సర్వస్వాలు ప్రజలకు అందజేసాం. 'చెప్పులు కుడుతూ.. కుడుతూ', 'సర్ అర్థర్ కాటన్ జీవితం-కృషి' అనువాద రచనలు ప్రచురించాం. ఇవన్నీ ప్రజలు చదవాలన్న కోరికతో పుస్తకం తయారీ ధర కన్నా చాలా తక్కువ ధరకే అందించాం.

గురజాడ సర్వస్వమైన ఈ గ్రంథంలో వారి లభ్యరచనలను అనువాదం చేయకుండా యథాతథంగా ఇందులో చేర్చాం. సాధ్యమైనంత వరకు తొలి ముద్రణలను ప్రామాణికంగా చేసుకున్నాం. ఈ పుస్తకానికి ప్రధాన కారకులు పెన్నేపల్లి గోపాలకృష్ణగారు. వీరు ఈ గ్రంథాన్ని చూడకుండానే కన్నుమూయటం ఒక పూడ్చలేని విషాదం. వీరు రచించి ప్రచురించిన 'మధురవాణి ఊహాత్మక ఆత్మకథ' చాలా మందిని అలరించింది. వీరు 2009లో ఆంగ్లంలో ప్రచురించిన Diaries of Gurajada కు సంపాదకత్వం వహించారు. వీరి కృషికి మనసు ఫౌండేషన్ కృతజ్ఞతలు.

గోపాలకృష్ణ గారు అప్పగించిన బాధ్యతను అందుకుని చివరి వరకూ నిర్వహించిన డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు. గురజాడ రచనల సేకరణతో పాటు అనేక విధాలుగాను సహాయపడిన వెలుగు రామినాయుడు, పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావుగార్లకు కృతజ్ఞతలు. ఈ పుస్తకానికి సహనంతో సమర్థతతో డి.టి.పి. నిర్వహించిన రంగిశెట్టి వెంకటరమణగారికి, ప్రూఫులు దిద్దటంలో సహకరించిన వేణుగారికి, అన్ని విధాలుగా సహాయపడిన మహమ్మద్ రసూల్‌గారికి, శ్రీ పి.ఎల్.ఎన్. ప్రకాశంగారికి, శ్రీ కాళిదాసు గిరిధర్ Scientist, LAM గారికి, చిర్రా ఎలక్ట్రానిక్స్ సిబ్బందికి, ఇతర మిత్రులకు అభినందనలు.

ముచ్చటైన ముఖచిత్రం అందించిన బాపుగారికి కృతజ్ఞతలు.

కవర్ డిజైన్ చేసిన శివసాయి గ్రాఫిక్స్‌వారికి, మా పుస్తకాల ముద్రణలో మొదటి నుంచీ సహకారం అందిస్తున్న కళాజ్యోతి బాపన్నగారికి, వారి సహచరులకు ధన్యవాదాలు.