పుట:Gurujadalu.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(కొండుభొట్లు ప్రవేశించి) కొండి: పంతులుగారూ, పంతులుగారూ, ( రామప్పంతులు, మధురవాణీ ప్రవేశింతురు) రామ : (మధురవాణితో) నువ్వు లోపలకి వెళ్లు (కొండిబొట్లుతో) యేవిఁటి? కొండి : మరే వచ్చి, - పట్టుకోలేదు. రామ : (తీక్షణంగా) యెందుకు పట్టుకున్నావు కావు? కొండి : చెప్పరానిదాన్ని యలా పట్టుకోవడం? మధు : చెప్పరానిదాన్ని యెందుకు పట్టుకోవడం? కొండీ :దిడ్డీ తోవంట యవరొచ్చినా పట్టుకొని, కాకెయమని పంతులు చెప్పారు. మధు : యేవిఁచిత్రం! యేం అప్రతిష్టా! బ్రాహ్మడికి వెట్టెత్తుతూంది కాబోలు. రామ : (మధురవాణి వెనక నిలచి చేతితో వెసొమ్మని కొండిభట్లుకు సౌజ్ఞచేసి) పేలుడుగాయ వైదీకపగుంటడి వెకాశ్యాలు నిజం అనుకుంటావేవిఁటి? (లోపలికి వెళ్లును) ( రామప్పంతులు యింటిలోనికి వెళ్లగానే మధురవాణి సావిడి వెనకతలుపు పైనుంచి వేసి,కొండిబొట్లును లోపలికి రమ్మని సౌజ్ఞ చేసి ముద్దెట్టుకొనును. ) మధు : (నిమ్మళంగా) బాగా, కాపాడావు! కొండి : మధురవాణీ, యిదుగో పంతులిచ్చిన బేడ. యిదుగో హెడ్డుగారిచ్చిన పావలా. యింద వెండితొడిపొడికాయ (యిచ్చును). మధు : (పుచ్చుకొని) నువ్వు మంచివాడివి. యీవేళ నుంచి, నీకూ నాకూ నేస్తం. తెలిసిందా? (మరివక సారి ముద్దు పెట్టుకొని) యిక వెళ్లు. (కొండిబొట్లు చెంగున వీధిలోకి యెగిరి వీధి నడుమ గెంతులు వేయును) ( కాంభొట్లు ప్రవేశించి) కాంఢా: యెందుకురా యీ గెంతులు? ముద్దెట్టుకుందిరా! కాంఢా: వెట్టివెట్టి వేషాలు వెయ్ కు. యీ కోతి మొహాన్నే! కొండీ : పోస్సి, వెట్టి కుట్టా! మేం జట్టుకట్టాం! (నిష్క్రమింతురు) కన్యాశుల్కము - మలికూర్పు కొండి: గురుజాడలు 312