Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.9 (1935).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ యుద్యమాభివృద్ధికి సాయపడు విధానము లింక నెన్నియో గలవు. కాని వాని నన్నిటిని సూచించు భారమును సభాప్రారంభకులు వహించుట ఆచారముకాదు. కాన నేనందుకు సాహసింపను. ఇప్పటికే హద్దుమీరితినేమో యని శకించుచున్నాను. మఱియు అమూల్యమగు గ్రంథాలయోద్యమ విషయములనేకములు, సహజమగు మృదుమధుర వాక్కులతో మనకు సృతపరిచి, మనల నెదుర్కొను సమస్యల వివరముగా చర్చింపనున్న అధ్యక్ష మహాశయుల ఘనన్యాసమును వినుటకు మీవలెనే నేనును అత్యంత కుతూహలుడనై యున్నాను. కాన నా యుపన్యాసము నింతటితో ముగించుచు, విసుగు జనింప జేసినను దయామయులై ఓపికతో నావిజ్ఞప్తిని వినిన మీ కనేక వందనము అర్పించుచు, ఈ గుంటూరు మండల గ్రంథాలయ దశమ మహాసభ విజయవంతముగ జరుగునటుల ననుగ్రహింప బరాత్పరుని బ్రార్థించుచు, ఈ మహాసభను పరమానందముతో ప్ర్రారంభించున్నాను.

ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘసభ, విశాఖపట్టణము

(ది 25-11-35)

సామాన్యసభ్యుల సమావేశమునందు చేయబడిన తీర్మానములు

౧ ఆంధ్రదేశ గ్రంథాలయసభలు ఇతర సభలతో అనుబంధముగా చేయకూడదని యీసభ వారు తీర్మానించుచున్నారు.

౨ ఆంధ్ర దేశ మంతయు గ్రంథాలయయాత్రలద్వారా గ్రంథాలయోద్యమమును వ్యాపింప చేయవలసినదని ఈ సభవారు తీర్మానించుచున్నారు. శ్రీవావిలాల గోపాలకృష్ణయ్య గారి నాయకత్వముక్త్రఁద పశ్చిమాంధ్ర జిల్లాలకు సైకిళ్ళమీద గ్రంథాలయ యాత్రను పంపుటకు తీర్మానించడ మైనది.

3. (క) ఆంధ్రవిశ్వవిద్యాలయమువారు తమ ప్రాచ్యబిరుద పరీక్షలలో తెలుగు ప్రధానముగా గల పార్టు 'బి' విద్వా౯క్ పరీక్షను, ద్రవిడ భాషల పాండిత్యమునకై ఇచ్చుపార్టు సి విద్వా౯ పరీక్షను తీసివేసియును, తెలుగు పాండిత్యమునకై బిరుదు నిచ్చునట్టి పార్టు 'డి' విద్వాక్ పరీక్షను అసలే పెట్టకుండను చేసి తెనుగు భాష యెడ నిరాదరణ చూపినందులకై ఈసభవారు తమ విచారమును వెల్లడించుచున్నారు.

(చ) ఆంధ్రవిశ్వవిద్యాలయములో నడపబడు ప్రతిప్రాచ్యభాషాపరీక్షకు తెనుగు భాషను కూడ పాఠ్యవిషయముగా నిర్ణయించ వలయునని ఆంధ్ర విశ్వవిద్యాలయము వారిని కోరు చున్నారు.

(ట) తెనుగు భాషా పాండిత్యమును దేశములో విస్తరింపజేయుటకుగాను మదరాసు విశ్వవిద్యాలయము యొక్క ప్రాచ్య భాషాపరీక్షల విద్యాప్రణాళికకు సమాధానముగ పార్టు బి. సి. డి. విద్వాను పరీక్షలను ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘపక్షమున జరుపుటకు ఈ సభ వారు తీర్మానించుచున్నారు.

(త) సదరు పరీక్షలను అమలులో పెట్టుటకు గావలసిన యావత్తు కార్యక్రమమును ఈ సంఘ పక్షమున నిర్వహించుటకును, ఇతరులను చేర్చుకొనుటకును, నియమించుకొనుటకును, అధికారము ఇచ్చుచు అన్ని యేర్పాటులు చేసి ఈ పని నెరవేర్చుటకు ఈ క్రిందివారిని ఉపసంఘముగ ఏర్పాటు చేయడమైనది. శ్రీయుత మారేపల్లి రామచంద్రకవిగారు (అధ్యక్షులు) » ఉన్నవ లక్ష్మీనారాయణగారు(కార్యదర్శి) మందల పూర్తి ఉపేంద్రశర్మగారు (సహాయ కార్యదర్శి) » త్రిపురనేని రామస్వామిచౌదరిగారు (సభ్యులు)