Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.2 (1934).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16వ ఆంధ్రదేశ గ్రంథాలయమహాసభ,

కాకినాడ.

జనవరి నెల 21, 22 తేదీలు, 1934 సం॥

ఆంధ్ర దేశమందున్న వివిధమండలములనుండి పలు వురు గ్రంథాలయముల ప్రతినిధులు 20 వ తేదీ సాయంకాలమే విచ్చేసిరి. ప్రతినిధులందరికిని అప్పనవారి సత్రమందు బసలు భోజనవసతులు ఏర్పాటు చేయబ డెను. పలువురు స్త్రీలుగూడ ప్రతినిధులుగా వచ్చి యుండుట గమనింపదగిన విషయము. ప్రతినిధుల సౌక ర్యమునకై ఆహ్వాన సంఘమువారు విశేషపరిశ్రమ జేసి చక్కని ఏర్పాటులను గావించిరి.

21వ తేదీ ఉదయము 8-30 గంటలకు ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము యొక్క వార్షిక సమా వేశము జరిగేను. మధ్యాహ్నము 2-30 గంటలకు అన్నదాన సమాజమువారి ఆవరణలో వేయబడిన విశాలమగు పందిరిలో 16 వ అంధ్ర దేశగ్రంథాలయ ప్రతినిధుల మహాసభ ప్రారంభమయ్యెను. ప్రధమమున కొందరు పండితులు వేదమంత్రము లతో పా ను గావించిరి. ప్ర్రార్థనలను

శ్రీదుగ్గిరాల వెంకటసూర్యప్రకాశరావుగారి

ఆహ్వాన సంఘాధ్యక్ష కోపన్యాసము,

పమునారవ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభకు వ్యయప్రయాసల కోర్చి దూర ప్రదేశముల నుండికూడ దూరప్రదేశములనుండికూడ విచ్చేసిన భాషాభిమానులరగు మీకు నీ సభాసన్మాన సంఘము వారిపక్షమున మనః పూర్వక స్వాగత మొసంగు చున్నాను. వెనుకటి కోఆపరేటివురిజిస్ట్రార్లలో నొకరు ఆ డిపార్టుమెంటు వార్షిక నివేదికలలో నుదాహరిం చినట్లుగా చెన్నపురి రాజధాని దక్షిణమండలములందు ఐకమత్యాభివృద్ధికి పరపతి సంఘవ్యాప్తి కారణభూత మగుచున్న రీతిని ఆంధ్ర మండలములందు గ్రంథాలయ స్థాపనప్ర్రాచుర్యము దృఢమగున్నదని వ్రాసినవిషయ ము క్రమక్రమముగ స్థాయియగుచున్నదని చెప్పుట అతిశయో క్లికాదు. ఆయుద్యోగీయుఁడు పైన వ్రాసిన దానిని బలపరచుచు పరపతిసంఘస్థాపనాభివృద్ధి కూడ వెంబడించి, ఆంధ్రదేశమున పరి జైకమత్యమునకు జన సామాన్యజ్ఞానాభివృద్ధికి రెండుమార్గములు ఏర్పడినవి.

నాగరకత చెందిన దేశము లని చెప్పబడిన ఏప్యా యూరపుఖండభాగములందు ప్రజలు లిపిని నిర్ణయించు కొనిన కాలమునుండియు తమజ్ఞానమును గ్రంధరూప మున చిరస్థాయిచేయుటకు బ) యత్నించినట్లు దృష్టాంత ములు ప్రజలముగ గానబడుచున్నవి. శాగితములు, సాధనములు లేని ముద్రాయంత్రములు మొదలగు పూర్వకాలమున లోహము, రాయి, ఇటుక, భూర్జప త్రము, చర్మము, తాళపత్రము మొదలగు పరికరముల సాహాయ్యముతో భాషాభిమానులు, విద్యాభిమానులు, వివేకమహితులు తమ యభిప్రాయములను లిఖించి చిత్రించి చెక్కించి పురాతన జ్ఞానమును మనకు లభ్య ముగావించిరి. గ్రంథము సేకరించుట క గవ్యమని యెంచి పాటుపడిరి. పురాతన దేశములలో చీనా, టిబెటు, భరతఖండము, పారశీకము, బాబిలను, ఆస్సీ రియా, ఈజిప్టు, గ్రీసు మొదలగునవి ప్రధానముగ బేరొ నదగినవి. క్రీస్తుశకారంభమునకు దరువాత యూ పుఖండమునందలి వివిధ దేశములందు గ్రంథాలయస్థాప నమును, గ్రంథముల సేకరించు ప్రయత్నము 'ఎట్లు విజృంభించెనో తెలుప ప్రయత్నించుట అనావశ్యక మని తలచి దానినిగూర్చి చెప్పదలచలేదు.

ఈ దేశమున ముఖ్యముగా ఉత్తర హిందూస్థానమున మత, వైజ్ఞానిక, నైతిక, శాస్త్రీయ, రాజకీయ విషయ ములనుగూర్చి గ్రంధబాహుళ్య ముండెననియు, అట్టి విజ్ఞానభాగ్యమువలననే వీర పురుషులతో పాటు ధీబల సంపన్నులు పెక్కురు ప్రతిచోట బ్రబలియుండుట