Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ చరిత్ర


ఈ యుద్యమమునకు గారణము? ఈగ్రంథాలయస్థాపకు లకును సంరక్షకులకును ఈ యుద్యమవిషయమై పూను కొనుటకు, బే రేపించినమహాశక్తి యెది? ఇందుకు ప్రతిఫల ముగ ఈ యుద్యమ సేవకులు బడయగోరు మన్ననయెది? వీరు వాంఛించు ఫల మేమి! ఈ యంశములను గూర్చి కొంచె మాలోచించినయెడల ఆంధ్ర దేశగ్రంధాలయో ద్యమముయొక్క స్వరూపస్వభావములు కొంతవరకు బోధపడగలవు.

ఈ యుద్యమమునకు పేరకులు తాము బాగై తమ తోడివారలను బాగుచేయవలె నను మనుష్యస్వభావమున నాటియున్న తీవ్రమగు వాంఛయే. ఈ యుద్యమ ప్రచారకులు కోరుఫలము తమకురు తమతోడి వారికిని జ్ఞానాభివృద్ధివలన పొందెడు ఆనందమే. ఈ యుద్యమ మునకు పురికొల్పు మహాశక్తి ప్రపంచాభివృద్ధికొఱకు అప్పుడప్పుడు ఆవిర్భవించు మహోద్యమములను పాదు కొల్పి, వానికి జీవసత్వములను గల్పించు ఈశ్వరపే రిత కియే. ఈ యుద్యమ ప్రచారకులు తాము ఈశ్వర పేరితులమనియు ఈశ్వరోదిష్ట కార్యములను తాము నెరవేర్చుచున్నా మనియును దృఢతర భ కిపూరి తులై యున్నారు. ఈ యుద్యమము ఇతర ఉద్యమ ములవలె మూడునాళ్ళముచ్చటతో బోవునది గాదు. ఇది నాయకుల యధీనమునందున్న యుద్యమమును గాదు. గ్రంథాలయములు తాత్కాలికముగ ప్రారంభించి, స్వల్పకాలము జరిపి, తిరిగి మూయబడునవి కావు. వాని యందు సంవత్సరము పొడుగునను పని జరుగుచుండును. నవ్యోత్సాహపూరితులైన యువకులే ఈ యుద్యమము నకు మూల కారకులె యున్నారు.

ఏ యుద్యమమైన సరియైన మార్గముల నవలంబించి, అందులకు నిర్ణీతమగు పనిని నిర్వర్తింపవలె నన్న ఆ యుద్య మావలఁబులకు, అందలి ప్రాప్యముల స్వరూప స్వభావముల యొక్కయు, ఆ యుద్యమమునకును తోడి యుద్యమములకునుగల యన్యోన్య సఁ బంధముల యొక్క . యు జ్ఞానము దృఢముగ నుండి తీరవలయును. ఏయుద్య మమున కెన ఆదర్శమే ప్రాణము. ఆదర్శము యుద్య మము ప్రాణములేని రూపము. ఆదర్శములేని యుద్య మములు వృద్ధి బొందవలె నన్నచో, తమయందు స్వాభావికముగా నున్ని జవసత్వములవలన గాక, సతతము పరాపేక్షను బొందియుండును. పైనుండి వచ్చు సహాయ మెప్పుడు తగ్గునో, అట్టి యొద్యమ మప్పుడే భగ్న మైపోవును. అట్లుగాక ఆదర్శముతో గూడిన యుద్యమము ఈశ్వరనిర్మితమగు సంపూర్ణ సౌరవముతో గూడిన జీవికవలె దినదినాభివృద్ధి గాం చును. ఆదర్శము యొక్క శకీ వర్తింపదరము గాదు. అది మహత్తరము, ఆదర్శము నేకాగ్రచిత్తతతో ధ్యాన ము చేయుచుండినయెడల, కార్యాచరణయందు వచ్చిన కష్టములన్నియు సుఖములుగా పరిణమించి, కార్య దీక్షను ప్రజ్వలింపజేయును. కావున ఈ యుద్యమము యొక్క ఆదర్శమును బాగుగా గుర్తెరుంగవలెను.

ఇతర దేశము లన్నియు మనుజుని మేధాశక్తిని వృద్ధి నొందించుటకే ప్రయత్నము లొనర్చుచుండ ఆంధ్ర దేశ గ్రంథాలయోద్యమమున మనుజుని సంపూర్ణ మను ష్యత్వమును వ్య క్తీకరించుటకు తగిన సాధనావలంబన మంతయు చేరియున్నది. కావుననే మన ఉద్యమము యొక్క ఆదర్శము దేశమునందు జ్ఞానాభివృద్ధిని గలుగ జేసి, మనుజుని జీవయాత్ర పవిత్రవంతముగను పురు పార్థసాధకముగను చేయుటయే యైయున్నది. మన మొసఁగుజ్ఞానము నిద్రాణమైయున్న ఆత్మ నుదీపింపజేసి, పౌరునికి గావలసిన సన్మార్గ జీవనమునకు గొనిపోవునవిగ నుండవలెను.

అనుకరణముగా నుండరాదు

ఈ ఆదర్శనమును ఎల్లప్పుడును దృక్పధమునం దుం చుకొని, ఈ యుద్యమము పేరిట జరుగు ప్రతి పనియు ఈ ఆదర్శమును కార్యరూపమున బెట్టుటకు తోడ్పడు చున్నదియు లేనిదియు తెలిసికొనవలెను ? ఈ ఆదర్శము కార్యరూపము దాల్చవలెనన్నచో, మనము అవలంబిం పవలసిన మారములు కేవలము అనుకరణరూపమున నుండిగూడదు. పాశ్చాత్య దేశములయందలి ఉద్యమము లను ఉన్నవి యున్నట్లు మనదేశమున నాటుటకు ప్రయ త్నించినయెడల, మన దేశమునందలి వృద్ధిగాంచ నేరవు. కావున మన సాంప్రదాయములను బట్టియు, మన దేశీయుల యలవాటులనుబట్టియు, ఇతర పరిస్థితులను బట్టియు, ఇచటి యుద్యమములు ప్రచారమగుచుండ వలయును. అట్లని పాశ్చాత్య దేశముల యొక్క అనుభవములను "దీసికొనరాదనువారుండరు. అయితే అట్టి యనుభవములకు మనము దాసులమై మన రూపు మారిపోరాదు, ఆ యనుభవములు మనకు ఆ యనుభవములు మనకు దాసులై మన యుద్యమముయొక్క సౌష్టవమునకు మన యుద్య మముయొక్క సౌందర్యమునకు దోహద దాయకము లె యుండవలయును. మనుజుని సంపూర్ణ మనుష్యత్వమును వ్య కీకరించుటకు మన పూర్వులు, దేవాలయములు, 3