(11) ఈ సభాతీర్మానములను అమలులో పెట్టుటకును, ధర్మ గ్రంథాలయోద్యమమును ఈ మండలములో వ్యాప్తి చేయుటకును ఈకింది వారిని స్థాయిసంఘముగా యేర్పాటు చేయడమైనది.
అధ్యక్షులు:–
ఉపాధ్యక్షులు:—
కార్యదర్శులు:-
(12) రాబోవు సంవత్సరము ఈసభను ప్రత్యేకముగా ఆలమూరు నందు చేయుటకు శ్రీ నరసింహదేవర సత్యనారాయణ గారిచే
ఆహ్వానింపబడినది.
బర్మాదేశ గ్రంథాలయోద్యమము
గ్రంథాల యోద్యమము ఆంధ్రసీమలండు విరివిగా మొలకలెత్తుచు సర్వజనాదరణమును బొందుటయేగాక యిరుగుపొరుగు రాష్ట్రీయ సోదరుల మానస సీమలందును గూడ నాకర్షింపబడి నీ యుద్యమమును దమదమ మండలములందును వెదజల్లవలయున నెడు యుత్సాహము వారి నాయకశిఖామణులకు జనించి, దానికి దగినకృషి సల్పుచున్నారు. అయితే పొరుగుననుండు నీబర్మాదేశమున గ్రంథాలయోద్యమమునందు పూనిక వహించియుండునటుల కాన్పింపదు. ఎందుకన భారతీయులవలె బర్మీయులందు ప్రోత్సాహము లేకపోవుట యటుండ, ఈ యుద్యమమునకు ప్రజాప్రతినిధుల మనోదృష్టి యందైన స్థానమేర్పడియుండలేదు. విద్యావంతులకన్ననో ఉద్యమతత్వ మింకను సువ్యక్తముగా బోధపడలేదు, రంగూను విశ్వవిద్యాలయము కార్యరూపము