Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.1 (1929).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16 గ్రంథాలయ సర్వస్వము .


మనగ్రంథాలయములలో ప్రతిదానికిని, ప్రత్యేకావసరముల ఉన్న సంగతి నాకు తెలియక పోలేదు. మా గ్రంథాలయము నకు ఇటీవల వరకును పెద్దవిరాళములేవియు లేవ్స్; వాస అవసరము మాగ్రంథాలయమునకు బాగుగా కలదు. కాని అమెరికాదేశ గ్రంథాలయ సంఘమునకు చేయుసహాయము మన గ్రంథాలయాభివృద్ధికి ఎంత మాత్రమును భంగకరము గాదు. దానివలన మనగ్రంథాలయముల అభివృద్ధికి దోహదము లభింపగలదు ఈవిషయమున నాభాగము చేయదలపని యెడల, ఈవిషయము మీకు చెప్పియే యుఁడను.

ప్రపంచమునం దుండు సర్వజనులను ఎక్కువ సౌఖ్యవంతులు గాను - ఎక్కువ తెలివితేటలు గల వారుగాను- ఎక్కువ శాంతవంతులు గాను - ఎక్కువ ఐశ్వర్యవంతులుగాను చేయుటయందు గ్రంథాలయములు ప్ర్రాముఖ్యత వహింపగల వని నాదృష్టికి విస్పష్టముగ గన్పట్టు చున్నది.

అధ్యక్షుని యుపన్యాసమైన పిమ్మట కాంగ్రెసు లైబ్రరీ చాలకాలము గ్రంథ భాండాగారిగా నుండి ప్రఖ్యాతివహించిన “ఫుట్ నాం” గారికి సన్మానపత్ర మియ్యబడినది. వారియెడల సద్భావమునకును మెప్పుదలకును, స్మరణమునకును సందేశమొకటి పంపబడినది. విద్యాశాఖాధికారి గ్రంథాలయసంఘరుతో సహకార మొనర్చెద మని సందేశమంపెను, విద్యాశాఖయొక్క తోడ్పాటువలన గ్రంథాలయములు అమితమైన సేవను జేయుటకు అనేక సావకాశములు గలవు. కాలేజీలయందును, విశ్వవిద్యాలయములందును గల గ్రంథముల పట్టికలు 24,768 విద్యాశాఖ గ్రంథాలయమందు గలవు; ఇవిగాక 2865 చిన్న పాఠశాలలయొక్కయు, 11,995 పెద్ద పాఠశాలల యొక్కయు రిపోర్టులు గూడ గలవు. మరియు ఇతర దేశములందలి విశ్వవిద్యాలయములందలి గ్రంథములపట్టికలు 17:0 గలవు. వీనికితోడు 10,796 టెక్స్టుబుక్కులు గూడ గలవు.

(సశేషము)