Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.1 (1921).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3


రచయిత:రాపాక లక్ష్మీపతి

(శ్రీ శేషాద్రి రమణ కవులు)

ఇతఁడు భద్రాయురభ్యుదయమును వైదుల్లాసముల పద్యకావ్యమును విరచించి నిజాము రాష్ట్రములోని బిక్కనవోలు సంస్థాన ప్రభువగు కామినేని రాజేశ్వరరావు ప్రేరణముచే శంకరున కంకితముఁ గావించెను. కవి యుభయభాషాకవ్విదుర్యుఁడు. గ్రంధమునఁ గవి నియోగియొ వెదికియొ నిర్ణయించుటకు నాధారములు కానరావు. ఇవఁడు పరాశరగోత్రుఁడు, లింగనార్య తనూభవుఁడు. తండ్రికి నార్యపద ముపయోగించుట వలన నితఁడు వైదికియనియె తోచుచున్నది. ముద్రితప్రతిలో నొక యాశ్వాసాంత గద్యములో మాత్రము కవి జనకుని పేరు లింగనామాత్యయని కలదుగాని కడమనాలు గాశ్వాసముల గద్యయందు నార్య శబ్దసుంటచే సమాత్యపదము ముద్రాపకులు ప్రమాదమని తోఁచుచున్నది. లక్ష్మీపతి కవిస్తుతిలో నన్నయభటారకుని దిక్క యజ్వను మాత్రమె నుతించి యెఱ్ఱాప్రగడను ప్రశంసింప మానెను. దీనివలనఁ గవి మిక్కిలి ప్రాచీనతరుఁడని తోఁచుఁగాని చరిత్రాధారములచేఁ గవి యాధునికుఁడని తేలకపోదు.


ఉ.⁠

 ప్రాకృత సంస్కృతాంధ్ర పరభాగము లుల్లసిల్లంగ వైకృత
వ్యాకరణంబుఁజేసి బుధవత్సలతన్ సకలార్థవత్పురా
ణాకలి తేతిహాసముల నన్ని విచించిన నన్నయార్యు సు
శ్లోకుని దిక్కయజ్వను వచోనియలి౯ వినుతింతు మత్కృతి౯|

⁠


ఆధునికుఁడైన నిక్కవి కవిత్రయముకు బ్రశంసింపక శిష్టజనాకార వ్యతిరేకముగ నన్నయ తిక్కనాదుల మాత్రమే పేర్కొనుటకుఁ గారణమూహ్యము. కవి తన్నుఁగూర్చి ప్రభువు ప్రశంసించు ఘట్టమున స్వరచిత గ్రంథనామములు నిటులు భద్రాయురభ్యు దయమునఁ జెప్పుకొని యున్నాఁడు.


సీ౹౹⁠

 అద్వితీయాపరోక్షాను భూతిప్రసి
ద్ధాచార్య విజయమాంధ్రాంచితముగ
ఘనజగజ్జన్మాది కారణశ్రీమదు
పాఖ్యానము దెలుంగు సైదలిర్చ
లలిత పదార్థాద్యలంకార సహిత నీ
శాలివాహము సమతా సమల్లాగం
గృతులు మెచ్చంగా శ్రీకృష్ణ విలాసంబు
నవనోహరముగా మునురచించి

⁠


తే౹౹గీ॥⁠

 మించియున్నటి నిన్ను వర్తించఁదరమె
ప్రబలరాపాక వంశ సంభవి నవీన
జవన కఐన ప్రభన భాషావిశేష
లక్ష్మణ ప్రతిభాదుర్య లక్ష్మణార్య"

⁠


తే౹౹గీ॥⁠

 నీవు శబ్దా చిత్ర సన్నిహిలమైన
కవన మొనరించు ప్రోడవుగాననొక్క
దైవి కావ్యక్త సూక్తి సంధాన మహిమ
గలిగిన ప్రబంధము రచింపు కౌతుకమున|

⁠


ఆచార్య విజయ, శ్రీమదుపాఖ్యానము, నీళా వివాహము, శ్రీకృష్ణ విలాసము, నీకవిరచించెను. ప్రభువు రచింపఁ బేవ్రాయించిన దీభద్రాయుభ్యుదయమునె. భద్రాయురభ్యుదయము జక్క కవికృతేతర గ్రంధములు కానరావు. శ్రీ మానదపల్లి రామకృష్ణకవిగారు లక్ష్మీపతి కృతిమగు శ్రీకృష్ణ విలాసము పద్యకావ్యముఁజూచితి మనియు నప్రొధముగ ఉన్నదనియుఁ జెప్పియున్నారు. భద్రాయురభ్యుదయ ముత్తమ గ్రంథములోఁ బరిగణింపఁదగిన ప్రబంధము. ఇందుఁ జిత్రికవిత యెక్కుడుగఁ గలదు. ప్రథమాశ్వాసమునఁ బ్రభునియాస్థానమంటపము. పురవర్ణనము, దైవసందర్శనము లోనగునవి వర్ణించుచుఁగవి తనకుఁగల కపతాచాతుర్యమరియు వివిధగతులఁ బ్రదర్శించియున్నాడు. తెలుగుఁ ఒదములయల్లిక కంటె సంస్కృత పదరచన మీకవిత సహజనగు నభ్యాసముఁ దోఁచుచున్నది. కవియొక్కయుఁ గృతివిరచినమునకుఁ బ్రేరకుఁడగు ప్రభునియొక్కయు నివాసాదికములఁ బరిశీలింతము.

భద్రాయ భ్యుడయ రచన ప్రేగరుఁడగు కామినేని గాడెశ్వరరాయ ప్రభు లక్ష్మీపతి కవి రాజన్న దేశాయియని వ్యవహరించి యున్నాడు. ఈ రాజన్న దేశాయి రామరెడ్డిపేటఁ బంపాలించుచుండెను. ఈ రామరెడ్డిపేట షట్చక్రవర్తి చరిత్రాది గ్రంథకర్తయగు మల్లారెడ్డికిఁ గుమారుడుగు రామురెడ్డి పేరఁ గట్టఁబడినటుల నుమాపత్యభ్యుదయము చెప్పుచున్నది. రాజన్నదేశాయి రాచుళ్ళ గోత్రీయుఁడు. పాకనాటి రెడ్డికులములోని వాఁడు ఈ వంశమునకు మూలపురుషుఁడు కామినేఁడగుటచే