188
జ్ఞానము ప్రపంచమును కలవరపరచుచున్న కొనుటకు కొంతకాలము ప్రయత్న ముజరిగినది అశాంతిని నిర్మూలము చేయగలదు.
మన గ్రంథాలయ సంఘ సభ్యులకు కల సావకాశములు మరి ఎవ్వరికిని లేవు. మనపల్లెటూర్ల యందు ధర్మాదాయము లెన్నియో కలవు.ఇవియన్నియు అన్యాక్రాంతములై ఉద్దేశింపబడిన పనులకు వానియాదాయములు వ్యయము కాకుండ పోవుట తటస్థించుచున్నవి. వాని యాదాయమును దొరతనమువారు స్వాధీనపరుచుకొనుటకు కొంతకాలము ప్రయత్నము జరిగినది. గాని ఇప్పుడు ఏ యూరియందలి ధర్మాదాయముల ద్రవ్యము ఆయూరియందు సర్వజనోపయోమనకై ఖర్చు పెట్టవలయునను న్యాయమును దొరతనము వారు అంగీకరించు నట్లు కనబడూచున్నది. ఇట్టి ద్రవ్యమునుబట్టియు, ఇంక నిట్టిగణద్రవ్యమును ఇతర మార్గముల ననుసరించి కూడ సముపార్జన చేసి సర్వజనోపయోగము కొరకై వ్యయ పెట్టి ప్రజలందరకు తన్మూలమున సమానసౌఖ్య మొనగూర్చుట మన గ్రంథాలయ సంఘముల విధియైయున్నది.
ఆంధ్ర విద్యార్థి సంఘము, చిత్తూరు.
చిత్తూరు గవర్నమెంటు హైస్కూలు తెలుగు పండితులగు బ్రహ్మశ్రీ గొల్లపూడి శ్రీరామశాస్త్రి గారు 2.1-2-20 తేదీన “ఆంధ్రవిద్యార్థి సంఘము" బాలుర భాషాభివృద్ధికి స్థాపించిరి. అప్పటినుఁడి చాల శ్రమ తీసికొని దీనిని వృద్ధికి తెచ్చి యున్నారు. బాలురును వారి యభిమతము ననుసరించి మిక్కిలి శ్రద్ధతో పాటుపడుచున్నారు. ప్రతివారము నొక సభజరుగును. అందు బాలురు తమకిష్టులగునగ్రాసనాధిపతి గారిని కోరికొని వారి యధ్యక్ష్యత క్రింద ఉపన్యాసములు, వాద ప్రతివాదములు చక్కని యాంధ్రభాషతో చేయుచున్నారు. ఈ సంఘమునందు సుమారు 225 మంది సభ్యులున్నారు. వత్సరమునకు చందాలవలన సంఘమునకు సమారు 70 రూపాయలు పైబడి వసూలగును. ఈ సంఘమునకు హెచ్.సుబ్బారావుగారు బి.ఎ., యల్.టి. అధ్యక్ష్కలుగాను, గొల్లపూడి శ్రీరామశాస్త్రిగారు ఉపాధ్యక్షులు గాను, నిర్ణయించుకొనబడిరి. ఈవత్సరపు చందాలలో నుండి దిన, వార, పక్ష, మాస పత్రికలు తెప్పింపబడుచున్నవి. ఒక బీరువాను తెప్పించుచున్నారు.
ఉదార మనస్కులగు జిల్లాకలెక్టరు వారు ఈ సంఘమునకు యీ సంవత్సరము 100రూప్యములు గ్రాంటు యిప్పించియున్నారు.
ఆర్.నారాయణ రావు,
కార్యదర్శి.