Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.5 (1919).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(1) బాలభట పటాలములను కూర్చుటఎట్ల?

లో బడిన వారును, ఆవయస్సునకు పైబడినవా గునుగూడ ఇందుజేరవచ్చును. వారికి తగిన ఏర్పాటులు గలవు.

ప్రజల యొక్క- ఉత్సాహ ప్రోత్సాహము లమీద నే ఈ యుద్యమము సంపూణముగ ఆధారపడి యున్నది.

ఈ యద్యమమును ఇంకను వివరముగ దెలిసికొనదల చినగాని, ఈ యుద్యమమురు బోధింపగల ఇతర గ్రంథములను తెలిసికొన దలచినగాని ఆంగ్లేయభాషా గ్రంథములకైన వ్రాయుడు :____య. జి. పియర్సు ఇటుల 03 దొరవారు, భారతవర్ష బాల భట నాయకుడు, అడయారు, మద్రాసు.

ఆంధ్రభాషా గ్రంధముల కై ఇటుల వ్రా యుడు:-కావలి శంకరరావు పంతులుగారు, సంయుక్త కార్యదర్శి, భారతవర్ష బాలభట సంఘము, బెడవాడ. ఆంధ్ర దేశమునందు ఎక్కడనైన, భారతవర్ష బాలభట సంఘము నాకు శాఖలనుగాని, బాలభటసైన్యములను గాని ఏర్పరుపగోరువారు వీరికి వ్రాసిన తగిన సలహాలను సహాయమును బడయగలరు.

బాలభట పటాలములను కూర్చుట ఎట్లు?

జట్టు పెదల తరిబీతు.

బాల భటోసాధ్యాయులుగ తరిబీతు పొం దిన వారందరును తమ తమ గ్రామములకు పోయిన పిమ్మట "జట్టులను” సమకూర్చి పిమ్మ ట పటాలముల నేర్పరుపనలసి యుందురు. వారు జట్టుల నేర్పరచుటకు ప్రారంభమునందీ గ్రంధములను తెప్పించికొని యుండుట అత్యం తావశ్యకము:——— ౧ “బాలభటులమై యుండు టెంగులకు?" (పన్నెండు ప్రతులు.) ౨ "బాల భటుని తరిబీతు.” (పన్నెండు ప్రతులు.) 3 ప్రాథమిక చికిత్స. పన్నెండు ప్రతులు. ర బాలభటునిక వాతు. పన్నెంకు ప్రతులు. ఈ గ్రంథములన్ని యు “భారతవర్ష బా లభట సంఘము, బెజవాడ" అని వ్రాసిన బడయగలరు.

ఎ. ముందుగా జట్టు పెద్దల తరిబీతును ప్రారం లెను. మీ గ్రామమునందు మిక్కిలి తెలివిని చురుకుదనమును గలిగి బాలభటులు కాగోరు వారిని పండ్రెండుగురినికాని, పదు నారుగురిని కాని సమకూర్చుము. అంతకన్న ఎక్కువ మందితో ప్రారంభింపకుము. ఈ జ ట్టు పెద్దలు సరియైన తరిబీతును పొందుటకు మూడు మాసముల కాలమైన పట్టును. మొ దటిజట్టు తబీతును పూర్తిగ పొందుటకు పూర్వము రెండవ జట్టును తీసికొనకుము. అట్లు తీసికొనిన యెడల ఏ జట్టుగాని సరియైన తరిబీతును పొందుటకు అవకాశముండదు. ప్రాధమిక శిక్షావిధానము. మొదటి సాయంకాలము లేక ప్రాతః కా లము: బాలభట విద్యను వారికి చక్కగ బోధింపుము. జట్టులుగ విభజింపుము. రెండవ దినము :- ఉదయము సాయం కాలము ౧ ఈల వేయగా నే భటులు అందరును “గుర్రపుడెక్క” ఆకారముగ ఏర్పడవలెను. దొరతనము వారి బావుటాను పైకెత్తి, నమ స్కరింపవలయును.