శ్రీ వీరేశలింగాస్తిక పుస్తకాలయము, రాజమహేంద్రవరము
దివాన్ బహుదూరు రఘుపతి వేంకటరత్నము నాయుడు ఎమ్. ఏ. గారి ఆధిపత్యము క్రింద కాళయుక్తి సంవత్సర చైత్ర శుద్ధ త్రయోదశినాడు (౨౪-౪-౧౮) ఈ గ్రంథాలయము రావుబహద్దరు కందుకూరి వీరేశలింగము పంతులు గారి ౭౧ వ జన్మదిన సంబంధమున, నూతనముగా తన్నిమిత్తము నిర్మింపబడిన భవనమున తెరువ బడినది. ఆసమయమున శ్రీ పంతులవారి యుపన్యాసము నిచ్చిరి:౼
ఓ పరమేశ్వరా! ఓ సర్వకారుణ్యా! అణువు మొదలు కొని బ్రహ్మాండమువరకును గల సమసపదార్ధములును నీ మహిమను సహస్రముఖములు ఘోషించుచున్నవి. నీ కళ్యాణగుణములు అనంతములుగ ఉన్నను వానిలో నెల్ల కారుణ్యము సర్వోత్తమమై భాసిల్లుచున్నది. నీకరుణామహిమవలన నే చీమ మొదలుకొని సామజము వరకును గల సమస్తజీవరాసులును సౌఖ్యమును ఆనందముకు అనుభవించుచున్నవి. విశేషజ్ఞులై సంసార సుఖములను ఖాని వనవాసము జేసి, కాయక్లేశములను సహించి, నీ గుణానుభవము కొరకును నీ దివ్యమహిమ ప్రకటనముకొరకును నిరంతర కృషిజేసినను వారు నీ కళ్యాణగుణములను పూర్ణముగ ఎరుగజాలినవారు కారన - అల్పజ్ఞుడనైన నేనా నీ గుణాతిశయములను పూణ౯ముగ ఎరుగ గలవాడను! నీకరుణా గుణము పశుపక్ష్యాది సమస్త జీవరాసులయందును స్పష్టముగ కానబడుచున్నను అది మనుష్యకోటియందు అత్యధికముగ నువ్యక్తమగుచున్నది. మృగాదులకును మనుష్యులకును గల గుణములలో అనేకములు సామాన్యములై యున్నను, నీ ప్రేమమును తెలిసికొని నీకును తనకును గల పితా పుత్ర సంబంధముచేత నీ శాసనముల ననుసరించి నీ ఇచ్ఛానుసాగముగా ప్రవతి౯౦చెడు ధర్మగుణమును విశేషముగా కలవాడే నీయెడల వినయమును భక్తినిచూపి నిన్నారాధించెడు ధర్మగుణమును కలవాడు ఒక్క మనుష్యుడే అయియున్నాడు. ధర్మమనగా ఈశ్వరుని పితృభావమును మానవకోటియొక్క భ్రాతృభావమును గ్రహించి తర్యషయమున మనుష్యుడు నడుచుకొనవలసిన కృత్యమై యున్నది. ఈ సంబంధమున మన పూర్వులు
ఆహార నిద్రాభయమైధునంచ
సామాన్యమేతత్ పశుభిర్నరాణాం
ధర్మోహి తేషా మధికోవిశేషో
ధర్మేణ హీనాః పశుభిస్సమానాః
ఆహారమును నిద్రయును భయమును భోగేచ్ఛయును, మృగములకును, మనుష్యునకును, సామాన్యములైయున్నను ధర్మగుణము ఒక్కటి మాత్రము మనుష్యునియందు విశేషము. అదిలేనివాడు పశువుతో సమానుడని చెప్పియున్నారు.
ఈ ధర్మమును తెలిసికొన గలుగుటకు జ్ఞానము అనగా విద్య అత్యావశ్యకము - ఈవిద్య ఒక్క ఉత్తమకులీనులలో మాత్రమేకాక సామాన్య జనులలోను స్త్రీలలోనుకూడ వ్యాపింపవలసి యున్నది. ఈ జ్ఞాన సంపాదనముకొరకే గ్రంథాలయములు దేశమందంతటను వ్యాపింపవలయును. కాబట్టి గ్రంథాలయములయొక్క ఆవశ్యకమునుగూర్చి విశేషముగా నొక్కిచెప్పవలసిన ఆవశ్యకములేదు.
ఈశ్వరుడు సమస్త జీవలోకమునకును సమానముగానే ప్రేమను జూపుచున్నను, నేను ఆ పరమేశ్వరుని ప్రియుపుత్రుడననియు నాయెడల అధిక ప్రేమను జూపుచున్నాడనియు నేను భావించుచున్నాను. ఈ ప్రకారముగానే తక్కినవారందరును భావించుకొను చుఁడవచ్చునుగాని నామనస్సు నీయందు ఈశ్వరుడు ఎక్కువ ప్రేమను చూపుట సత్యమని బోధించునప్పుడు, నామనస్సు బోధించు దానిని నేను ఎట్లు నమ్మకుండగలను? ఈశ్వరుడు నాకు కష్టములను గలిగించినను అవికూడ నా మేలు కొరకును లోకముమేలు కొరకును అయి యున్నపని నేను నిశ్చయముగా విశ్వశించు చున్నాను. కడచిన మాఖమాసములో నాకు ప్రాణ సంశయాస్పదమయిన వ్యాధి సంభవించుటగూడ, ఇప్పుడీగ్రంథాలయ నిర్మాణమునకు తోడుపడినది. ఆ వ్యాధియేరాకయుండినయెడల కొంచెము సేపటిలో తెరవబడనున్న ఈ గృహము మన పురమునకు లభించి యుండకపో