178
భారతవర్ష బాల భటోద్యమము
ఇక్కాలమున మన బాలురు పాఠశాలల యందు ఎట్లోకష్టించి, కొంతవిద్యను సంపా దించుచున్నా రేగాని వారికి ప్ర్రాపంచిక వ్యవ హారములించుక యేని తెలియకున్న వి. వారికి స్వయంప్రతిభ శూన్యము. దేహబలమునందు కడుశుష్కులు ; రోగపీడితులు. ఇటువంటి యిక్కట్టులబోగొట్టుటకయి" బేడను పౌలను” నాతడు ఇంగ్లాండున ౧౯౦౮ వ సంవత్సరమున బాలభటోద్యమమున స్థాపించి పెంపుచేసెను. అయ్యది అప్పటినుండి ప్రపంచము నందంత టను ప్రాకి యిక్కాలమునకు మనలో కొందఱి యొక్క ధైర్యసాహ సములవలన చెన్న పురి యందు పుష్పించి భారతవర్ష మంతటిని తన సౌరభముత `వెదజల్లు చున్నది.
ఈయుద్యమమునకురు మరియేతర మ తమునకును ఏవిధమైనటువంటి సంబంధమును లేను. హిందు వైనను, మహమ్మదీయుఁడైనను, క్రైస్తవుఁడైనను, నాస్థికుఁడైనను - యిందు చేర వచ్చును; అందువలని లాభము లనుభవించి ధన్యుఁడుగావచ్చును. వారు వారు వారివారి మతాచారముల ననుసరించి దైవప్రార్ధనలు మొదలుగాగల వానిని జరుపుకొనవచ్చును. ఈవిషయములం దేవిధ మైన నిర్బంధనయు లేదు.
యుద్ధ సమయములయందు, యుద్ధరంగము లయందెల్లెడల మార్గములను త్రోవలను దెలి సికొనుటకును జాబులను వృత్తాంతములను ఒక చోటనుండి మరియొక చోటికి దీసికొనిపో వుటకును, చుట్టుప్రక్కలనుండు దేశస్థితిగతు లను దెలిసికొనుటకును చారులు నియమింప బడియుందురు. ఇక్కాలపు బాలభటునికి ఈ చారులకు గావలసిన గుణములనన్నిటిని నేర్పు దురు. అయినను ఇవియన్నియు యితరులకు ఉపకారము జేయుట కేగాని యుద్ధమున ఉప యోగ పరచుటకుగాను. చారుల తరిబీతు నం తనుపొందుటవలన వీరు మానవ సేవ జేయుటకు కావలసిన సకల సద్గుణములను పొందుటయే గాక ఎట్టి కార్యమునైనను కష్ట మనిసం దేహింప కుండ నిర్వహించుటకు తగిన సమర్థతను సం పాదిం చెదరు.
హఠాత్తుగ కలుగునట్టి అగ్నిభయములు మొదలయిన వాటినుండి తప్పించుటకు వలయు సామర్ధ్యమును చాకచక్యమును బాలభటుడు గలిగి యుండును. సాధారణముగ ఏ మను జునకయిన గాయముతగిలి నట్టులయిన, చుట్టు పట్లనుండు వారు ఏమియు తెలియక శా శాస్త్రోక్తమైన తరిబీతు లేనివారగుట చే తత్తరపడుచు 'ఇంగువకట్టు ఉల్లికట్టు ' అని కేకలు వేయుదురు. మతొక్కడు యింకొక వైద్య మును చెప్పును. తుదకు వారు చేయునది రో గికి మేలు చేయుటకు బదులు బాధ నధికము గావించును. అట్టి సమయములయందు ఎంత మాత్ర మాలస్యములేక దగ్గరయున్న వస్తు వులతో దెబ్బతగిలిన యా దురదృష్టవంతు నాకు ఎంతమాత్రము పోషణ చేయవచ్చునో అంతమట్టుకు వారిశక్తి కొలది వైద్యుడువచ్చు నంతవఱకు సహాయము చేయుటకు బాల భటుడు సామర్థ్యముగలవాడై యుండును.
ఇంతియగాక, బాలభటులకు పిన్నతనము నుండి 'సదా సంసిద్ధుఁడై యుండుడు' అను సూత్రమెల్లప్పుడు బోధించుచుందురు. కావున వీరు పెద్ద వారలై సంసారము చేయునప్పుడు ఎట్టి యిక్కట్టులు సమకట్టినను జంకక, ఖన్నుడై యింట గూర్చుండక కార్యసాఫల్యము నకుఁ గడంగుదురు. 心