Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.4 (1918).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

055 గ్రంథాలయ సర్వస్వము

చే స్థాపింపబడింది. ఆసంవత్సరాంతమునకు ౨౩ గురు సభ్యులు చేరిరి. ఈ సంవత్సరాంతమునకనగా ఈరోజున ౩౧ మంది సభ్యులు గలరు. ఈగ్రంథాలయము ౨౪ గ్రంధములచే మాత్రము స్థాపింపబడి ఆ సంవత్సరాంతమునకే ౬ గ్రంధములను గ్రంథాలయము చేకొనబడి ౯౮ గ్రంధములను సభ్యులచేతను తదితరులచేతను ఒసంగపడి మొత్తము ౧౨౦ గ్రంధములు గలిగియుండెను. ఈ సంవత్సరాంతమునకు గ్రంథాలయముచే కొనబడినవి. ౨౧ గ్రంధములును, సభ్యులచేతను తదితరులచేతను ఒసంగబడినని ౪౩ గ్రంధములును మొత్తము ౧౮౪ గ్రంధములను గిలిగియున్నది. ఈ సంవత్సరమందు చదివిన గ్రంధముల సంఖ్య ౨౮౬. ఈ సంవత్సరమందు 3 సభలు జరిగెను. ఈ వత్సరము ఆదాయము రు ౫౫-౧౩-౯లు. వ్యయము రు ౩౯-౧౧-౬ లు. గాకనిల్వ రు ౧౬-౨-3 లు.

౼ సాగి రామనాధశాస్త్రి,

కార్యదర్శి



శ్రీ సుజనాను మోదినీ సమాజము—హీరమండలము.

గంజాంజిల్లాయఁదున్న ఈ గ్రంథాలయము పరీధావినాను సంవత్సర శ్రావణ కృష్ణాష్టమీ దివసంబున పార్నంది సత్యనారాయణమూతి౯ గారి యాధిపత్యమున అంధవరం నారాయణగారి భజనగృహంబున కొందరు మిత్రుల ప్రోత్సాహము ననుసరించి పైనామమున నొక భక్తసమాజమును స్థాపించబడెను. ప్రతి యేకాదశీదినంబున ఆస్తిక మతానుగుణ్యములగు చర్చలు జరుగుచుఁడును. సభ్యులందరు భగవత్సరంబగు శ్లోక ద్వాదశకంబుచే ప్రాతస్సాయంకాలముల ప్రాధ౯న మొనర్చుచుందురు. అప్పు డప్పుడు అన్నదానము, దాహధానము, పురాణపఠనము, మొదలగు సత్కార్యములు జరుగుచుండును.

ప్రథమ వార్షి౯కోత్సవ సందర్భమున సర్వజనులు ఉచితముగా చదువుకొనుటకు అనుకూలముగానుండు విధమున గ్రంథాలయ భాగము గూడ ప్రారంభింపబడెను. సభ్యులు ద్రవ్యరూపముగాను గ్రంథరూపముగాను తోడ్పాడుచున్నవారలు మాసమునకు సుమారు ఆరు రూప్యములవరకు మాసవిరాళములు గలవు. కాళయుక్తివత్సరశ్రావణ కృష్ణాష్టమి దినమున సమాజ గ్రంథాలయవార్షికోత్సవ మతి వైభవముగా జరుపబడెను. ఈ వత్సరమందు గ్రంధముల అభివృద్ధి ౨౮౫. ఇండ్లకు తీసికొనివెళ్ళిన గ్రంధముల సంఖ్య 3౪౦. స్త్రీలచే చదువబడిన గ్రంధముల సంఖ్య ౦౧౯. పురుషులచే చదువబడిన గ్రంథముల సంఖ్య ౨౨౧.

ఆదాయము:౼ రు ౧౩౮-౦-౦ లు.
వ్యయము : — గ్రంధములకొరకు పత్రికలకొరకు రు ౪౫-౬-౩.
అన్న దానమునకు ౧౪-౧౫-౦.
వార్షికోత్సవమునకు ౫-౧౦-౦.
ఆంధ్రవిద్యానిధికి ౧౮-౧౨-0౯-౧౨-0.
ఇతర ఖర్చులు ౨౩-౯-౭.
వెరశి ౧౦౮-౪-౧౦.


శ్రీమల్లేశ్వర గ్రంథాలయము ౼ జగన్నాధపురము.

కృష్ణాజిల్లా రెడ్డినీగుయందున్న జగన్నాధ పురమున ఈగ్రంథాలయము ౧౯౧౭ సంవత్సరము నవంబరు ౧౬ వతేదీన మిత్రత్రయముచే స్థాపింపబడినది. ప్రారంభమునందు ౬౦ ఆంధ్రఆంగ్లేయ గ్రంథములు మాత్రము గలవు. ఇప్పుడవి ౩౦౦ వరకు పెరిగినవి - మాగ్రంథాలయ ప్రతినిధులు చుట్టుప్రక్కల గ్రామములకు ఇరువది తాళపత్రగ్రంధములను సంపాదించిరి. అందు నాలుగు ఆచ్చు పడని గ్రంథములుగలవు. మాగ్రంధాలయమునకెవరైన తగినంత సహాయము చేసిన మేమాపొత్తములను వారి కిత్తుము.

మాయొద్ధగల గ్రంథములలో ఈ క్రిందివి అచ్చుపడియుండవని తలంచితిమి:౼ ౧ పురుషోత్తమ క్షేత్రమహత్యము- ఇది తాడేపల్లి రామస్వామి కవి విరచితము. ౫ ఆశ్వాసములగ్రంథము సంపూర్ణముగనున్నది. రాజమంద్రియందు న్యాయవాదులుగనున్న వెన్నేటి రామచంద్రరావుగారు మాకుసహాయమును చేయుదమని దీనిని తీసికొని వెళ్లియున్నారు.

౨ రామాయణము — యుద్ధకాండ- ఇది నృసింహఅప్పలాచార్యతనూభవుడు సూర్యలార్య విరచితము

.

3 తెనుగుభగద్గీతలు:— ౧వ ఆశ్వాసములు, జగ్గయ్య కవి విరచితము; ౪ సర్పవర క్షేత్రమహత్యము:-

వెన్నెలగంటి సుర కవి విరచితము

.

౼ చల్లా నరసింహము, కార్యదర్శి.