Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(6) . ఆంధ్రపరిశోధక మహామండలి


ఆంధ్ర పరిశోధక మహామండలి.

పీఠికాపురమునందీ సంఘము ౧౯౧౭వ సంవత్సర ప్రారంభమున స్థాపింపబడినది. ప్రప్రధమమున వీరొక లిఖిత పుస్తకాలయమును నెలకొల్పిరి. దానికొక చిన్న నూతన భవనమును కొనియున్నారు. ఒకవత్సరము లోనే ఆధవనము నిండిపోవునట్లు లిఖిత గ్రంధములను సంపాదింపగలిగిరి. దీనినిబట్టియే స్థాపకులు కార్యోత్సాహము విశదనుగుచున్నది. వీరు సంపాదించిన గ్రంథములన్నియు అముద్రితములు గాకపోయినను, కొన్నియైన మరియేగ్రంథాలయమునందును లేనివి గలవు. ముద్రిత గ్రంధముల ప్రతులు కూడ పాఠభేదముల కుపకరించును. నూతనసూత్రములకట్టుచు ప్రస్తుతము గ్రంధరక్షణ మొనర్చుచున్నారు. కృష్ణాపత్రిక, సుదర్శని, హితకారిణి, గ్రంథాలయ సర్వస్వము మొదలగు యందు వీరు పరిశీలించిన గ్రంధవివ్వ ములు ప్రకటించుచున్నారు. ఆపరిశోధనల వివరణములను గ్రంధరూపమున ప్రకటించినచో, చరిత్రకారులకు అమితసహాయము కాగలదు. ఈమండలిని యర్నగూడెంజమీందారు లగు శ్రీ శ్రీ చెలికానిధర్మారావు గారు, బార్. ఎట్. బార్-ఎట్. లా), చెలికాని లచ్చారావు గారు, చెలికాని సూర్యారావుగారును స్థాపించి ఇంతవరకు దీనికగు వ్యయమంతయు స్వయముగ భరించుచున్నారు. దీనిని వీరు ఆంధ్ర లిఖిత కేంద్ర గ్రంథాలయమున ఒనర్ప ప్రయత్నించుచు న్నారు. లక్షలకొలది ధనము రాబడిగలఅ నేకులు భాషా విషయమున ఉదాసీనులైయుండ, ధనవంతులగు భాషాపోషకులగు కొందరు ప్రభువులవలె వీగుకు ఉదారభావముతో భాషారక్షణను జేయుచు దేశోపకార దేశోపకారమొనర్చు చున్నారు.

లిఖిత కేంద్ర గ్రంథాలయమున వేలు, లక్షలు, వ్యయ పరచి చేయవలసిన కార్యము. అట్లు వ్యయ పెట్టినను దేశీయుల ఏకీభావము లేనిది ఇతర ముద్రిత గ్రంథాలయములవలె గ్రంథములు సేకరించుట సులభకార్యము కాదు. ఈ ఈ మహాకార్యమునకు దేశమునందలి ప్రభువులు, ప్రజలు, గ్రంథాలయములును ఈ ప్రతిష్టాపనము దేశీయులందరిదేయను విశుద్ధభావముతో గోడ్పడి, ధన గ్రంధసము దాయముల నర్పించిన గాని స్థాపకుల యభీష్టము సంపూ గత నొందజాలదు. వీరు సంపాదించిన అపూర్వగ్రం ధముల వివరములు, పరిశీలనలు, విమర్శనములు ముద్రించి, ఆంధ్ర దేశమునందలి గ్రంథాలయములకును, పరిశోధకులకును ఉచితముగ అందజేయుట కేర్పాటు చేయుట అత్యంతావశ్యకము. ఇంతేగాక నైజాము రాష్ట్రము నందు అముద్రిత గ్రంధములును, శాసనములను అమితముగ నున్నవి. ప్రత్యేక పరిశ్రమవలన గాని వానిని సంపొగించు భాగ్యము లభింపదు. ఇదికర కాప్రదేశమునందు ఆంధ్రసాహిత్యపరిషత్తునకై శేషాద్రి రమణ కవులు సంచారము చేసి అమూల్య గ్రం: ములను సంపాదించియున్నారు. వారే కారణముననో ఆ పనిని ఇప్పుడు చేయించుటలేదు. వారు విడచినపనిని వీరు తిరిగి ప్రారంభింపజేసి, ఆంధ్రుల కృతజ్ఞతకు బాత్రులయ్యెదరుగాక. ఈ మండలియందున్న గ్రంథముల యొక్క పటమును ఈ భాగమునందు ముద్రించియున్నారము.

జనసామాన్యమందలి విద్య.

దేశాభివృద్ధి ముఖ్యముగ జనసామాన్యముయొక్క విద్యాభివృద్ధిపై నాధారపడియుండును. ప్రాచీనకాలము నందు, ఇంగ్లాండు, జపాజ్, మున్నగు పాశ్చాత్య దేశములు అభ్యున్నతి యన నేమో యెఱుగనికాలమున నేమన దేశ మభివృద్ధి నందియుం డెను. ఇందులకు మన దేశమందలి ప్రజాసామాన్యమందలి విద్యాభివృద్ధియే ప్రాముఖ్యమని వచించుటకు నిదర్శనము లనేకము లున్నవి. కాని పాశ్చాత్యదేశీయులు విద్యావంతులగు కొలదిని మన వా రజాగరూకతచే విద్యావిహీనులై తరు వెనుకటి వైభవమునంతయు బోగొట్టుకొనుటచే రాను రాను ప్ర