శ్రీ వీరేశలింగకవి సమాజము, కుముదవల్లి
ఈసమాజము ౧౮౯౭ సం. జూన్ 29వ తేదీన స్థాపబడినది. ౧౯వ వార్షికోత్సవము శ్రీ రాయసం వెంకట్రామయ్య గారి యాజమాన్యమున జరుపబడినది. ఆసంవత్సర వృత్తాంతమును క్లుప్తముగా వ్రాయుచున్నాడను.
ఈవత్సరమున ౪౩ సమాజికులు గలరు. మహాజనసభలు ౧౧ ను, కార్యనిర్వాహక సభలు ౭ ను జరిగినవి. ౮౭ గ్రంథములను సామాజికులు తమగృహములకు దీసికొనిపోయి చదివిరి. స్త్రీలు మాత్రము ౧౬ం గ్రంథములను పత్రికలను చదివిరి. ప్రతిదినమును మందిరమునకు వచ్చుపాఠకుల సంఖ్య ౧౬. మాసమాజమునకు స్వంత భవనముగలదు. ౯ పత్రికలను దెప్పించుచుంటిమి. ౩ గ్రంథమాలికలను దెప్పించుచుంటిమి. ఈవత్సరము చందాలవలన, విరాళములవలన, దీపావళి నిధివలన, నిలవ ఫండుతాలూకు వడ్డీ వలన రు 33౬-౧౧-౧ జమవచ్చినది. ఇందులో రాత్రిపాఠశాలకు, వార్తాపత్రికలకు, గ్రంధములకు, అచ్చుఖర్చులకు, అన్నవస్త్ర దానములకు ఇతర ఖర్చులకు రు ౨౩౨౯-౯-౪ లు వ్యయమైనది. ఇది గాక నిలవఫండు కు ౬౧౪ లు గలదు.
స్త్రీ విద్యాభివృద్ధి, సమాజ ఉద్దేశములలో ముఖ్యవైనది. స్త్రీలు వారు కోరినపుస్తకములను, చందాను గ్రహింపకయే వారియిండ్లకు పంపియు, వారు బహుమతుల పరీక్షలకు జదువ దోడ్పడియు స్త్రీ విద్యను ప్రోత్సాహపరచుచుంటిమి.
నర్సాపురం తాలూకాభివృద్ధి సంఘమువారు స్త్రీల కొఱకు చేయుచున్న పరీక్షలో ఈసాలుస మాచే బ్రోత్సాహింపబడి పంపబడిన బాలికలయందు ౪ గురు కృతర్ధురాండ్రైరి. అందు మొదటి తరగతిలో ౨ న వారుగా జయమందిన భూపతిరాజు సూరమ్మకు భండారు అచ్చమాంబ గారి పతకమును, మొదటి తరగతిలోనే రెండవ వ వారుగా కృతార్ధురాలైన కలిదెండి లక్ష్మీనర్సమ్మకు గణితములో అల్లూరి వెంకట రమణమాంబగారి స్వర్ల పతకమును, మొదటి తరగతిలోనే ౪ వ వారుగా జయమంగిన పెన్మెత్స లక్ష్మీనర్సమ్మకు నర్సాపురం తాలూకాభివృద్ధి సంఘమువారి ఆంధ్ర వాల్మీకి రామాయణమును ఆతరగతిలోనే ౫ వ వారుగా జయమొంగిన సాగిసోషమ్మకు గణితములో వోసూరి నారాయణస్వామియుడుగారి స్వర్ణపతకమును నిచ్చిరి.
ఈసమాజము శాశ్వతముగా వర్ధిల్లుటకు, దొరతవము వారి చట్టములకులోనై విద్యాధికుల సలహాలపయినకొంత ఆస్థి నిచ్చినవారివలన సమాజము తాలూకు ఆస్థినంతయు, అయిదుగురను ట్రస్టీలను నేర్పరచి ట్రస్టు దస్తావేజు వ్రాయబడి ది 18-8-1916 తేదిని భీమవరం సబురిజస్ట్రారువారి ఆఫీసులో నె 654 కుగా రిజస్టరు చేయబడినది.
ఈట్రస్టు దస్తావేజు వ్రా గుటకు ముఖ్య ప్రోత్సాహకులైన ఈగ్రామవాసి భూపతిరాజు బాపిరాజుగారు దస్తావేజు రిజస్టరీ మున్నగు యావత్తు ఖర్చులు తామేభరించి సమాజమునకు శాశ్వతమైన యేర్పాటుకు గావి౦చిరి. ఈమధ్య కొన్ని కారణములవలన రాత్రిపాఠశాల తిరిగి పదునాలుగు మాసముల క్రిందట నెలకొల్పబడినది. అందు ౪౦ మంది విద్యాభ్యాసమును జేయుచున్నారు.
సెప్టెంబరు ౧ తేదీ నుండియు మాచే నిర్వహింపబడుచున్న ప్రార్థనాసమాజ పక్షమున ప్రతిసోమవారము సాయంకాలము ప్రార్ధనాగీతములలో ఉపాసన జరుపబడుచున్నది. చందాలవలన రు ౪-౧౨-౦ లను జమచేసి బీదలగు రోగుల ఔషధము నిమిత్తమిచ్చితిమి.
ఈసమాజ సభ్యులు కొందరు దీపావళిరోజున ఈ గ్రామములో యింటింటికిని తిరిగి వసూలుపరచిన సొ