గ్రంథాలయ సర్వస్వము
మల్లారెడ్డి
మల్లారెడ్డి కవి ప్రసిద్ధాంధ్ర కవులలో నొక్కఁడు. ఇతఁడు పట్చక్రవతి౯ చరిత్రము, శివధర్మోత్తర ఖండము, బ్రహ్మోత్తరఖండము, పద్మపురాణము, వాసిష్ఠ పురాణ ము, లైంగ్యపురాణము లోనగు గ్రంథము లాంధ్రమున రచియించెను. మొదటి రెండు పుస్తకములు మాత్రము ముద్రితములై యున్నవి. కవుల చరిత్రమున శ్రీవీరేశలింగము పంతులువారు కవికాలము నిరూపించుచు చ. బలుపుభోగ కాచ నర పాలుని పెద్దకుమారమల్ల నీ కలితయశఃప్రభావములు కల్గొనలే కల కట్టుమన్నె మూఁ కలు తలలొల్లతో బిరుదు గద్దియముల్ చదివించుకొందురౌ కొలఁదియెఱుంగఁజాల కల కుక్కలు చుక్కలఁ బూజించి కూయవే. ఈపద్యము నే అద్దంకి గంగాధర కవిని గూర్చి వ్రాయుచో చ. బలరిపుభోగ కృష్ణ నర పాలుని పేర కుమారకుల అని వ్రాసియున్నారు. ఈ పద్యము మన మల్లా రెడ్డికవి యాత్మ గౌరవార్ధముగాఁ జదివించుకొ నెననియు, సాటి రాజులు కత్తిదూసి వీరావేశులైరనియు మల్కిభరాం (యిబ్రహీం) శాంతపరచెననియు నొక దండకవిలెలోని కథను బ్రమాణముగ స్వీకరించి, మల్కిభరాం క్రీ. శ. ౧౮౧వఱకు గోలకొండ రాజ్యము పాలించెఁ గాన కుమా రమల్లయ నీ పద్యమునఁ బేరుకొనఁబడుటచే మల్ల (భూప తి) అప్పటికి కౌమారదశయందుండవచ్చుననియు క్రీ. శ. ౧౬౦౦ ప్రాంతమున జీవించియుండెననియు వ్రాసియు న్నారు. ఈ స్వల్పాంశమునఁ డొక్కు విఘాతములు కలవు. “కృష్ణ నరపాలుని పేర కుమార సల్ల”యని వ్రాసిన పద్య పాఠము మల్లారెడ్డి కన్వయింపదు. కావున “కాచనరపా లుని పెద్దకుమారమల్ల” అను పాశము స్వీకరింపవలయు ను. ప్రకృతకవియగు మల్లారెడ్డి కవి కాచభూపాలుని పుత్రుడే కాని పద్యమునందున్నటులఁ బెద్దకుమారుఁడు కాఁడు, శివధర్మోత్తరఖండమందలి “తే. గీ. ఘనుఁడు జంగమ రెడ్డియుఁ గామి రెడ్డి యెల్ల రెడ్డి నృపాలుండు మల్ల రెడ్డి యైన నేనును వెలనీతిమి......”” అను పద్యమువలనను ఉమాపత్యభ్యుదయములోని వంశ వృక్షమువలనను మల్లా రెడ్డి కడసారివాఁడని తేలుచున్న ది. కావున పంతులు వారు వ్రాసిన మొదటిపద్యము దా ని పాఠాంతరము ప్రకృతకవి కన్వయింపదు. మల్లా రెడ్డి వ్రాసిన గ్రంథములలో నతని యన్న యగు కామిరెడ్డి చక్కఁగ బ్రశంసింపఁబడి యున్నాఁడు. ఇతఁడు పట్ట మెట్ట సరస్వతిసోమయాజిచే సూతసంహిత కృతినొం ది యున్నాఁడు. నుఱియు నితఁడు గోలకొండ నవాబు ల మెప్పించి సంస్థానపు సనదు ౧ంగిగహిజరీలో (క్రీ.శ. ౧౬౭౭)లో పొందియున్నాఁడు. కావున సుప్రసిద్ధులగు నగ్రజులుండ నందు పెద్దకుమారమల్ల యని ముల్లా రెడ్డి సంబోధనము చేయనిచ్చునా ! మఱియు శివధర్మోత్తర ఖండము కృత్యాదియందు “మ. భువి మా యన్నగు కామిరెడ్డి కృపచేఁ బొషించి మన్నించినాఁ డు వెసకొ దాఁ దదృణంబుపాయునని తో డ్తో సిద్ధ రామార్పణం బవునంచు శివుఁడానతిచ్చినది మే లౌనంచు బుద్ధిస్థితిజ్ శివధర్మోత్తరవట్ల యంకితము గాఁ జేయంగ నేఁ బూనితి. " అనియుఁ జెప్పికొనియున్నాఁడు. కావున పైఁ బద్య ములు ప్రకృతాంశమునకుం బనికిరావు. కుమార ముల్ల