Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చు; కాని క్వాచిత్కము. అదిగాక ధర్మరాజను పేరు చాలవఱకీ చిత్రవైరుద్ధ్యమును గప్పి పెట్టుచున్నది. వ్యాసుఁడు వ్రాసిన వ్రాతలు సదివియే, చేసినచేతలుసూచియే మహాకవి వేమన

పేరుధర్మరాజు ♦ పెనువేపవిత్తయా
విశ్వదాభిరామ ♦ వినుర వేమ!

అని సవ్యాజముగాఁ బాడియున్నాఁడు. యుధిస్థిరజీవితమునందు గొన్ని యంశములు వాదనీయములు. ఈయుత్తమక్షత్రియుఁడు జ్ఞానయోగియా లేక కర్మయోగియా? నీతిజ్ఞుఁడా లేక నీతినిర్వాహకుఁడా? నాధనసవృద్ధుఁడా? లేక సాధన సమర్ధుఁడా? ఈ విషయములు తేలవలెను. ఇవియన్నియు సున్నితమయిన భేదములు. సూక్షమయిన భావచర్చలు; కాని ఈనిరూపణము నుంచియె ధర్మరాజు జీవితము పోషింపబడవలసియుది. ధర్మజుఁడు ఎంతవేత్తయో అంత సంకల్ప స్థైర్యముకలవాఁడుకాఁడు. ధర్మ సందేహములను నిశితబుద్ధితో కదలించువాఁడేకాని ఆత్మవిశ్వాసముతో స్థిరీకరించువాఁడుకాఁడు. ద్యూతము నిషిద్ధధర్మముని యాతఁడెఱుఁగును. కాని సంప్రదాయ సిద్ధమను క్షుద్రసంశయమును భాపికొనలేకపోయెను. ధర్మపత్ని ద్యూతపణముకాఁదగునని యొకఁడాదేశింపఁగా, అపుడు విధినిషేధముల నెఱుంగనట్లు ప్రవర్తించెను. ఈపోకడ ఒకానొక విషయమును దెలుపుచున్నది. అదియేదన? ధర్మజునిగ్రహణశక్తి చక్కని విచారదృష్టిగలదైనను అనుష్ఠానఘర్షణమునందు స్వయంసంఛన్నమగు స్వభావగౌర్బల్యములేనిదికాదు. విషయవేగమ్ముల భాగతరణమునందు ఇతఁడు తనకైతాను నడపిన సందర్భములు చాల అరిది. ఒకానొకకార్యమునకుఁ దాను కారకుఁడైనను, లోకము తాను నిమిత్తమాత్రుఁడని నిశ్చయించులాగు ప్రవర్తించు ఉపాయమునందుఁ జక్కనికుశలుఁడు. అందువలన దూరదృష్టిలేని మందప్రజ్ఞుఁడని యూహింపరాదు. తానెన్ని కార్యములు చేసినను

“చం.బ్రతికిన నాల్గునాళ్లు ఋతవారియుధిష్ఠిరుఁడ
న్న మేటికిరీతి ... ... ... ...

చెడకుండనుండు తెఱఁగుఁ బాటించుట ధర్మజుని మతము. అయితే ఇందొక సూక్ష్మవిషయమున్నది. ధర్మరాజ నిర్ణయములన్ని

"ఏక క్రియాద్వ్యర్ధి కరీ" అను న్యాయమునకు బ్రమాణములగుచుండును. కృష్ణ రాయభారమును సంకల్పించినవాడు ధర్మరాజు; తదౌచితిపట్లఁ గృత నిశ్చయుఁడు ధర్మరాజు. కాని నిశిత విమర్శనకుఁ ద్రోసినపుడు శ్రీకృష్ణ రాయభారమునకుఁ బ్రధానకారణము యుధిష్ఠిరుని ఉపాయచాతుర్యమా? లేక తత్తతస్సదర్భ సిద్ధమయిన స్వయంకృత కార్యమా? అనుగొప్ప సంశయమును పైకిఁ దెచ్చును. ఇఁకఁ బూర్వపక్షసిద్ధాంతములకుఁ గావలసినంత తర్కము. వీనికేమి! ధర్మరాజు కొండొక బలవత్తర హేతువుచే నీనాయకత్వపదవికిఁ దొలఁగి నిలచుచున్నాఁడు. భారతము ఇతిహాసము. రెండు రాజ కుటుంబముల స్వార్ధస్వామ్యములకు సంబంధించిన పెనఁగులాట. ఇందెంతవఱకును విషయోద్ధతీయున్నదికాని, విషయలాలిత్యమున కవకాశము లేదు. ఈ రణకధనమునకుఁ బ్రధాన నాయకత్వము రాజధర్మముచే నిరూపింపఁదగినది. అంతేకాని ధర్మరాజత్వముచే సమన్వయించుకొనవలసినది కాదు. భారతమందు ధర్మరాజు స్థితి మొదటినుండియు నట్లేయున్నది. ఉదాత్తధర్మనును దృష్టితో స్వధర్మము ననేక సందర్భములఁ దగులఁబెట్టెను. ఆతని ధర్మము ఏయుత్తమ ధర్మమయినను గావచ్చును; కాని ఉత్తమమగు క్షత్రియ ధర్మము మాత్రము కాదు.

"శా. వారు బ్రాహ్మణులె యేకీడైన సైరింపఁగ౯.

అను కవిపలుకులలో నీ రహస్యమే బయటపడుచున్నది. క్షత్రియధర్మమునందు కార్యనిశ్చయము ప్రధానము. బ్రాహ్మణధర్మమునకు కార్యచర్చ ముఖ్యమయినది. ధర్మరాజునందీ గుణదుర్బలత్వముచాలఁ గలదు. తెగఁబడి కర్ణునితో తారసిల్లినపుడయిన ధర్మజుని క్షాత్రము నైజసాహసముతోఁ బ్రజ్వలించినదికాదు. తనయసమర్ధతకుఁ దానులజ్జింపక తమ్ముని దిట్టసాగెను. కర్ణ విజృంభణమునకును అర్జునోపాలంభమునకును సందర్భముఁ గల్పించిన క్షత్రియనాయకుని ధర్మదృష్టియెట్టిదో యూహింపుడు. ఈయన శాపనార్ధములలో