Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము

పుష్పములను సమర్పింపవలెను. జీవుల పీకలు కోసిన పుణ్యము రాదు. విదుమిక్కిలి పాపము సంభవించును. ఒక మనుష్యుని కూనీ చేసిన పాప మనియు ఘోరమనియు చెప్పుదురు. మేకనుగాని దున్నపోతునుగాని మరే జంతువును గాని కూనీ చేయుట పాపముకాదా? అవి విూదృష్టిలో ప్ర్రాణము కలవి కావా!

సోదరులారా! ప్రపంచమున మీ రెంత స్వతంత్రులో ఇతరులుకూడ అంతస్వతంత్రులు. మీకు సుఖము కావలసిన యెడల ఇతరులను సుఖింపజేయుడు, పరమేశ్వరుడు సృష్టించిన సర్వ జీవులకును మనవలె సుఖదుఃఖములు కలవనియు, మన ప్ర్రాణములందు మనకెంత తీపియో ఇతర ప్రాణులకుకూడ వాటి ప్రాణములందు అంత తీపి యుండుననియు, సర్వజీవులును సర్వేశ్వరుని అంశ ములేయనియు నమ్మి ఏమహనీయుడు సమ స జీవులయెడల ప్రేమతో వర్తించునో అట్టి మహ నీయునికే ఆనంద మను స్వర్గము లభించును. ఆనందమే బ్రహ్మము.

కావున క్షుద్ర దేవతల పేరు గాని భక్షణా పేక్షతోగాని మరియే యితర కారణములచేతను గాని మీరు జీవులను హింసించి పాపమార్జిం చుటకంటె ఆశ్మవ త్సర్వభూతాని * (సకలపాణు లను తనవలె చూడవలెను) అను నార్యోక్తిని గుర్తించి ప్రేమోపాసన చేసి ప్రేమమయుడగు పర మేశ్వరునికృపకు పాత్రులగుదురుగాక!

శ్రీసుజనసమాజస్థాపనము, కొత్తూరు,

తే .౨౭-౬-౩౮ దీని అనకాపల్లి శ్రీ సుజన సమాజ ప్రచారకులు మ. రా. శ్రీ వేలం వెంకటరమణగారు సర్వసిద్ధి తాలూకాలో కొన్ని గ్రామములందు ప్రచారము చేసి నేడు మాగా మము : చ్చి స్థానిక సత్సంఘమందిరమువద్ద ఒక పెద్దసభను జరిపి, అహింసాప్రబోధమును చేసిరి. గ్రామ దేవతీ పండుగలలోగాని, ఆహారముకొరకు గాని, మరియే కారణాంతరములచేతగాని, ఎట్టి జీవిని హింసింపగూడదని ప్రజలందరికి తేటతెల్ల ముగ తెలియునట్లు ఉపన్యసించిరి. తత్ ప్రచార ఫలితముగ ఈ గ్రామమున ౧౯౬ మంది ౧౯౬ మంది యువ కులు మత్స్యమాంసాహార మద్యపానములను మరణాంతమువరకు విసర్జించెదమని ప్రమాణ పక్త్రముల నిచ్చిరి. ఇతరప్రజలు కొందరు అమ్మ వార్ల పండుగలలో బలులను నిషేధించెద మని వాగ్దానము చేసిరి. మరియు అనకాపల్లి సుజన సమాజమునకు శాఖాసంఘముగ ఈగ్రామమున సుజనసమాజ మను పేరుతొ జీవ కారుణ్య సంఘ మును స్థాపించిరి. ఈసంఘమునకు మ.రా.శ్రీ కన్నం పెద అప్పారావు గారు అధ్యక్షులుగాను, మ. రా. శ్రీ కన్నం శ్యామసుందర రావుగారు ' కార్యదర్శిగాను, శ్రీయుతులు కన్నం వెంకు నాయుడుగారు సహాయ కార్యదర్శి గాను, మరి ౧౨ మంది సభ్యులుగాను, ఎన్నుకొనబడిరి. ఇంకను ఇట్టి జీవకారుణ్య సంఘములు దయామయుడగు పర రమేశ్వరుని కృపచే అభివృద్ధినొంది, శాంతి కలుగుగాక. జయంతి వెంకటరమణ.

ఆంధ్ర దేశ గోరక్షణమహాసభ

౨౬-౭-౩౧ తేదీని పై సభ బెజవాడలోని రామ మోహనగ ంథాలయభవనమున శ్రీ ఎన మండ లక్ష్మీనరసింహమువంతులు గారి అధ్య క్షతను జరిగినది. అందు, శ్రీ ఉమర్ అలీషాకవి గారు మహమ్మదీయులకుకూడ గోరక్షణము కర్తవ్య మని తెలిపిరి.