Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.4 (1936).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

  1. శ్రీయుత శనివారపు సుబ్బారావు గారు
  2. శ్రీయుత తా. కుటుంబ శాస్త్రిగారు
  3. సామవేదం సత్యనారాయణ గారు

18. తీర్మానం: సెప్టెంబరుమాసములో తణుకు తాలూకా ద్వితీయ గ్రంథాలయ సభయు, గ్రంథాలయ యా త్రయు ఏర్పాటు చేయుటకు తీర్మానించడమైనది.
19. తీర్మానం : ఈ జిల్లా సంఘమును త్వరలో రిజ స్టరు చేయించుటకు తీర్మానించడమైనది.
20. తీర్మానం : తాలూకా కేంద్రమందున్నూ, జిల్లా బోర్డు గ్రంథాలయ భవనమునందును, జిల్లాకేంద్ర జిల్లా బోర్డు గ్రంథాలయమునందున్నూ, వరుసగా తాలూకా గ్రంథాలయ సంఘమునకును జిల్లా గ్రంథాలయ సంఘ మునకును ప్రత్యేకస్థలము నేర్పాటు చేసి ఆఫీసు ఉంచుటకు అనుమతి యిప్పించగలందులకు జిల్లాబోర్డువారిని కోరు టకు తీర్మానించడమైనది
21. తీర్మానం : జిల్లాలోని జిల్లా బోర్డు గ్రంథాలయ ములో ప్రస్తుతమున్న సాలీనా చందారు 3-0-0 ల నుంచి 0-4-0 లకు తగ్గించగలందులకు జిల్లా బోర్డు వారిని కోరుటకు తీర్మానించడమైనది.

(సం) దం. నారాయణ రాజు,
82-8-36.

సనాతన ధర్మము - శారద ఆక్టు

శారద ఆక్టువలన సనాతనధర్మపరులు కొందరు తమ పిల్లల వివాహములను నైజాంరాష్ట్రము ఫ్రెంచి రాష్ట్రములకు వెళ్ళిన్ని, మఱికొందరు రహస్యముగను జరుపుకొనుచున్నారు. కొందరు బహిరంగముగ చేసి జరిమానాలు చెల్లించు చున్నారు. సనాతనపరులు శారద ఆక్టు రద్దు చేయవలెనని కోరుచుండ, ఇంకను కఠిన నిబంధన లతో, బలపఱుపవలెనని సంస్కర్తలు కోరుచు న్నారు. ఈమధ్యకాలములో ఏమి చేయవలె నను ఆందోళన సనాతనధర్మపరులలో బయలు దేఱినది. ఇందునుగుఱించి విచారించి అభిప్రాయ మిచ్చుటకు ఈదిగువ వ్రాసిన పండితులతో కూడిన ఒక పరిషత్తు ఏర్పాటు చేయబడియున్నది. ఈ పరిషత్తును సమావేశపరుచుటకు శ్రీమాన్ సి. రాజగోపాలచారి, బి.ఏ, బి.ఎల్. అడ్వకేటు గారి అధ్యక్షత కింద అహ్వాన సంఘ మేర్పడి యున్నది. పరిషత్తువారి విచారణఱకు సూచ నల పంపువారు సమావేశకర్త పేర పంపవలసి దిగా ఇదివరకే తెలుపబడియున్నది. “రజస్వల కాకమునుపు కన్యాదానము చేయవలెననియు, ౧ర (14) సంవత్సరములు నిండిన తరువాత వివాహము జరుపవలెననియు, ఈ విధానము శారదఆక్టుకు గాని సనాతనధర్మమునకుగాని విరుద్ధము కాదనియు” ఒక సూచన ఆహ్వాన సంఘము వారివద్దకు చేరియున్నది. పండిత పరిషత్తువారీ సమావేశము జరిపి తగు నిశ్చయము చేసిన యెడల సనాతనధర్మపరులలో ఉన్న ఆందోళనముకు ఉప శాంతికలుగునని నమ్ముచున్నాను. ఈదిగువ పేర్కొనబడిన పండితులకు ఆహ్వానములు పంపబడినవి.

పండితులు

  1. తాతా సుబ్బారాయరాస్త్రిగారు
  2. దెందుకూరి నృసింహరాస్త్రి గారు
  3. వడలి లక్ష్మీనారాయణశాస్త్రిగారు
  4. ఉప్పులూరి గణపతిశాస్త్రిగారు
  5. ముదిగొండ వెంకట్రామ శాస్త్రిగారు
  6. వేమూరి రామగోవింద శాస్త్రిగారు
  7. పుల్య ఉమామహేశ్వర శాస్త్రిగారు
  8. జనమంచి శేషాద్రిశర్మగారు
  9. ప్రభల లక్ష్మీనృసింహంగారు
  10. కాశీ కృష్ణాచార్యులుగారు
  11. సూరి రామసుబ్బరాయశాస్త్రిగారు

పెక్కుమంది సభకువచ్చుటకు వాగ్దానము చేసిరి. పరిషత్తుసమావేశము రాబోవు దసరా లోగా జరుపుటకు ప్రయత్నములు చున్నవి.

(సనాతన ధర్మాభిలాషి)