Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.4 (1936).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

130 10 గ్రంథాలయ సర్వస్వము నాకు ఉత్సాహముకలదు. మా దేశపత్రిక, లలో దీనిని గురించి ఇదివరలో చూచితిని. తరి ఫీయతు పొంద ప్రయత్నించితిని. కాని సాగ లేదు. విద్యాలయములో దీనిని నేర్పుటకు ఒక శాఖ నేర్పరచిరి. నే నందులో సూత్రములను నేర్చుకొంటిని. ప్రత్యక్ష పరిశ్రమ చేయుటకు కూడా ఏర్పాటు చేసిరి. సెప్టెంబరు 14 వ తేది ఉదయము విద్యార్థుల వాయువిమాన శాలవద్ద చేరితిమి. మందరము గా 2 వాయువిమా కొత్త గా నిర్మింపబడిన వై గా నము సిద్ధముగా నున్నది. దుముకుటకు ఏర్పాట్లు అన్నియు చేసిరి. స్నేహితులు నాచుట్టు గుమి ధ కూడి వారికి తోచిన సూచనలు - సలహాలు నిచ్చిరి. విమానము రెక్క మీదికి వచ్చిన తరు వాత క్రింద వైపు చూడవద్దని కొందరు సలహా నిచ్చిరి. కొందరు దుముకు నప్పుడు కనులు మూసికొమ్మనిరి. గాలిగొడుగు ధరించివిమానములో కూర్చుం టిని. యంత్రము త్రిప్పగనే పెద్దధ్వనితో విమానము పై కి లేచెను. ఒక్కసారి విమాన శాలను చుట్టివచ్చెను. సుమారు 2700 అడుగుల యెత్తున నుంటిమి. a నేను వైమానికుడు వాయువునదలి రెక్కమీదికీ వెళ్ళి దుముకుటకు నాకు సంజ్ఞ చేసెను. రెక్క మీదికి వెళ్ళితిని. స్నేహితు లిచ్చిన సలహాలు మఱచితిని. నేలవై పుచూచితిని. మను ష్యులు చిన్న చుక్కలవలెను చెట్లు గడ్డిపోచలవ లెను కనుపించెను. నేను నిర్భయముగ నుంటిని. కొన్ని క్షణములలో విమానమునుండి క్రిందికి దుమికితిని. ఉచ్చును లాగి చితిని. స్వచ్ఛమగు పై తెల్లటి ఆగాలి గొడుగు నన్ను సంరక్షించుటకు తరంగ ములుతరంగములుగా విరిసినది. a మంద మందగమనమున నేలపై వాలితిని, మిత్ర బృందము కలకలలాడుచు నన్ను చుట్టు కొనిరి. సంతోషారావములు చెలరేగినవి. న న్ననుకరించి మరి నలువురు విద్యార్థినులు వెన్వెంటనేవిమానము నెక్కి గాలి గొడుగుగంతుల గాంభీర్యము సనుభవించిరి. ఆదినమే నాకు సుది నము; చిరస్మరణీయము. ఇక నొక్క సంవత్సరమున నిండు పండితబిరు దమునంది విద్యార్థులకు నా అభిమాన విద్యం గఱపుచు సంకల్పసిద్ధి నందుదును. (కవితాసమితిసభ్యుడు) విశ్వ సంరక్షకుడవంచు విశ్వసించి, ఎన్ని మారులు నీకడ విన్నవింతు నస్మదను రాగ భావరాహస్యవృత్తి, హృదయలజ్జానుభూతి పరిత్యజించి.

హాసపులకితనవమధుమాసనిశల, వలపు వేదురు వెట్ట చెక్కులు చెమర్చ ఈకడల నెంత వెదకి తపించినానో, వ్యోమపదవర్తియా చందమామ సాక్షి,

అమృత గంధిల మిల తాంతముల నడుమ, నే నొక సుమంబునై పుట్టినానె కాని సార్థకతగాంచ నోచుకోజాలనైతి, దేవదేవ! త్వత్పాదసం సేవనమున. 1.