76 గ్రంథాలయ సర్వ స్వ ము . త్సరము కన్న ఈ సంవత్సరం వ్రాసిన రచయితల సంఖ్య వ్యాసముల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తున్నది. అది చాలా శోచనీయమయిన విషయం. దీనిని సరి చేయవలసిన బాధ్యత, సంపాదకులమీదను స్త్రీ రచయితలమీదను ) గూడ, సమానంగా వున్నది. 'మాతృ, శిశు సంరక్షణము' ‘శిశుపోషణ' 'మహారాజ్ఞి స్వర్ణమయి' 'రాధాకృష్ణ' మొద లయిన వ్యాసాలు గమనింప తగినవి. 'అచ్చుల పాటివారి ఇళ్ళల్లో పునస్సంధాన కార్యాలు' అనేవ్యాసం, దురవగాహంగా వున్నది. బహుశః ఒకతమా పాకథద్వారా వ్యాకరణవిషయాన్ని వెలిబుచ్చుటయే శారదాదేవి గారి ఉద్దేశమయినట్లు కనుబడు తున్నది. అసలు వ్యాకరణమే క్లిష్టం. దానిని కధలో చొప్పించి క్లిష్టతరం చేయటం ఎందుకో తెలియదు. తేలి కయిన విషయాలు కావలసిన స్త్రీ పాఠకులకు ఇటువంటి విషయాలు అనవసరమేమోననిపిస్తున్నది. కధలలోనూ, వ్యాసాలలోనూ, అనువాదాలు, అనుకర ణాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. సంపాదకులు స్వతంత్య్ర రచనల నే ప్రోత్సహించితే బాగుంటుందని మా నమ్మకం. కధలలో అనువాదాలే స్వతంత్య్ర రచనలకన్న బాగున్నవి ఆ అనువాదాలుగూడా, మన కథా సారస్వతంలో ఎన్ని సార్లు చర్విత చర్వణమయినవే. ఈ పత్రిక స్త్రీలోకానికి చేస్తున్న సేవను ఎవరూ కాదనటానికి వీలు లేదు. దీనిని అందరూ సముచితరీతిని ఆదరిస్తారని నమ్ముతున్నాము . ద్రౌపదీ వస్త్రాపహరణము–సినిమా కవిత్వపు కంగారు సినోరియా నాటక కర్తలయిన పి. వై. శాస్త్రి గారు లో కానికి నూతనులు కాకపోయినా కవిత్వానికి నూతను లని తోచకతప్పదు. వీరు కొంతవరకు సమాసాలు డబ్బాల మ్రోతవలే మ్రోగించవలెనని చూచినారు కొని అవి ఎంత వరకు తగినవో ఎంతవరకు రపోత్పాదన కారణము లగునో యోజించినారు కారు. ఇందులకు సత్యభామ చదివిన “నీ సుకుమార సుందర,.. " అను పద్యమే తార్కాణము, ఇందు కొండవీటి చాంతాళ్ళవలే 3 సమాసాలు రసాన్ని చేద టానికి వేశారు. అయితే అర్ధంమాత్రం అడుగకూడదు. ఈకవిగారు పలికించిన వేణువు మాట్లాడును కాబోలు! “ప్రణయవాగమృతాదృత వేణువ” ని అన్నారు. అంతేనా అంటే, తరువాత సమాసంలో “భవదనన్య సుధాధరసక్త” ఈ అనన్య శబ్దానికి అర్ధంలేదు. అంటే నీయొక్క ఇతరము కానిదైన అమృతముకల అధరం' ఏమిసమా సమండీ శాస్త్రి గారు ఇతరం కాని అమృతమంటే? ఇంతేనా అంటారేమో అని ప్రతివాడి నోటినుంచి ఢమఢమ మ్రోయిం చారుడబ్బా, శాస్త్రిగారు, శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్న పద్యం చూడండి "ధన్యతరాగ మోదిత ఆగమాలికి విశేషణం "ధన్యతర” అను శబ్దము ఆయితే ఆగమములు ధన్యత్వం పొందుట చాలా విచిత్రముగా ఉంది. ఈపద్యంలో యింకో చిత్రంఉంది. మా సినోరియాశాస్త్రి గారు పంచపాదితో పద్యం నడిపి ఈ డేపల్లితాడంత సమాసం అర్ధం తెలియని మాటలన్ని అల్లివేశారు పాండిత్యం చూడండని. , రాజన్య కిరీటరత్న మయ చారురుచి ప్రచు రాంఘి యుగ్మ $ నా P మూర్ధన్యులు. తమ్ములు ‘ఆహహా ఏమిసమాసం “రాజనలీ కిరీట రత్న మయచారురుచి ఈ సమాసాని కర్ణం శాస్త్రుల్లు గారే చెప్పుకోవాలి. పండితులంతా ముప్పతిప్పలుపడ్డారు. ఏవిథాన అన్వయంచేసినా “రత్నమయానికి చారుకలిపినా అర్ధం దిగలా. తమ్ములు మూర్ధన్యు లగుదురా? మూర్ఖన్యు లనుపదాని కరం గ్రహించి యిందు ప్రయోగించినట్లు తోచదు. ఇంకాఉంది సరుకు న్నారు సినోరియా శాస్త్రి గారు.
దుర్యోధనుడు చదివిందే ఒక పద్యం. అది వజ్రపుతునక . చదివినవారు కవితాగంథము కలవారే. అయి తేఏం తప్పింది కాదు వారికి చదవక. ఈసమాసాల కర్ధంఏమిటని ఊహిం చినైన ఊహించారో లేదో, ధర్మనిర్మితమహా ప్ర్రాసాద బాహ్యదౌర్భాగ్య వనాంతకులు” “అస్మద్ద దాదూర మస్మరోద్దత భీమ బాహ్వాశ్రయస్థితుల్ 19 Q మొదటి సమాసంలో అలంకారంకూడా వేశారు. కాని సరిగా ఉందా? అంటే మా సినోరియాకవిగారే దానికి తార్కాణం. “బాహ్యదౌర్భాగ్యవనాంతరులు ఫాండు సుతులు?? ఏమిటిక విగారూ దీంట్లో ఆలినఫలితార్థం అంటే ఎవరైనా నోరు వెళ్లి పెట్టాలిసిందే కవిగారూ! యింకి రెండవ దాంట్లో “గ దాదూరఘస్మర” అనుటలో అర్థం దూర మయింది. పండితులంతా దాంతో కవి గారిని దూరందూరం అనాలిసి ఒచ్చింది. పదాలు కూడా ఎక్కువ రావటం పేత్ప.