38 74 గ్రం స ౦థాలయ సర్వ స్వ ము . విషయమై కె. నాగరాజరావుగారు వ్రాసిన వ్యాసము ప్రశంసనీయం గావున్నది. 'మా అమ్మాయి' పేరు అన్న వ్యాసంలో కల్తీలేని హాస్యంవున్నది. 'ఫ్రెంచి పేట' విష యమై వ్రాసిన పుట్టు పూర్వో తరములు చదవటానికి ఇంపుగా వున్నవి. కవిసోదరులు శేషగిరిరావు, జానకి రామయ్య గారలు రచించిన 'ఠాకూరు దురాదాసువిజ యము' ఈ పత్రికలో ప్రకటింపబడుతున్నది. ఇదివరి కే ఆంధ్ర దేశమున ఎన్నికగన్న కవులైన ఈ కవిసోదరుల యొక్క దేశభ క్తిపూరిత మైం బిగువయిన కవిత్వాన్ని గురించి ప్రశంసించటం అనవసరం, అయాచితుల హనుమచ్ఛాస్త్రి గారి 'న్యాయము' అనేకధలో తెలుగు జాతీయత ఉన్నది. తక్కిన కధలు అంత బాగాలేవు. ఉద్దేశాలను చర్విత చర్వణం చేస్తే విసుగుపుట్టుతుంది. వ్యాసాలను ఏరుకోటంలో సంపాదకులు ఇంకా కొంచెం విచక్షణ చూపితే బాగుం టుందని మానమ్మకం. దీని సంవత్సర చందా రు1-8-0. కావలసినవారు 'బాలసరస్వతి' మాజేరు అని వ్రాస్తే చాలు. భారతి : ఏప్రిలు సంచిక. ఏప్రిలుసంచిక. ఎప్పటి మోస్తరే ఆకర్షవంతంగా వున్నది. బొడ్డు బాపిరాజు, రాయప్రోలు సుబ్బారావుగార్ల ఉగాదిస్త వంతో ప్ర్రారంభం. తరువాత పెమ్మరాజు లక్ష్మీపతిగారి చెల్లమాంబ (గేయం) వున్నది. కుంటులేని నడకకు, తెలుగు నుడికారానికి, స్వచ్ఛమయన జాతీయానికి, గుండె నీరయ్యే ఆవేదనకు లక్ష్మీపతిగారి చెల్లమాంబ నిదర్శనం, టేకుమళ్ళ కామేశ్వరరావు గారి వ్యావహారిక రచనకు కొన్ని నియమాలు' గమనింపతగ్గది. నానా దేశ స్త్రీలు' 'నా మహారాష్ట్ర యాత్ర' మున్నగునవి, చదవతగ్గవి గావున్న వి. ‘అంధ్రుడు 'కాకినాడలో' అనిత. రా. గారు వ్రాసిన చిత్రములు ఆంధ్రునికి ప్రత్యేక రాష్ట్రమంటే ఎంత అశ్రద్ధ వున్నదో తెలియజేస్తున్నవి. మొత్తం కథలు మూడు ఉన్నవి. భారతిని చూచినా గూడా, ఆంధ్ర దేశములో కధారచన ఇంకా బాల్యావస్థ లో నే వున్న దనిపిస్తుంది. దీని దిద్దుబాటుకు ప్రయత్నం జరిగితే బాగుంటుంది. వినోదిని : ఏ పి లు సంచిక 50 పేజీలకు పైగా వున్నది. మొట్టమొదట నే, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారి బెంగాలీ వాద పుకథవున్నది. అదే దాదాపు 15 పేజీల సన్న అచ్చు ఆక్రమించు కొన్నది పత్రికలో. అసలు కథే అన్ని పే జీలు వుంటే కధాకళకు లోపం. పైపెచ్చు బెంగాలీ అను అనువాదాలు వాదంకూడాను. మనలో ఉత్తమమయిన కథలు వ్రాసే వా రున్నప్పుడు, అనవసరంగా బెంగాలీ వేయట మంత బాగుగా కనిపించదు. సంపాదకీయంలో గూడా తెలుగు జాతీయ కథలు (ఫోకులోరు) కావలె ననిన్నీ, దానివల్ల తెలుగు జాతీయతను పెంపొందించ తలచి నట్లున్నూ సంపాదకులు వ్రాశారు. దీనికి తార్కాణం బెంగాలీ అనువాద మేనా? అసలు భావం లేనిది కథవ్రాయ టం అనవసరం. ఈవిషయంలో క్రీస్తు యొక్క పేరబుల్సు, ఆదర్శప్రాయంగా వుండాలి. చెప్పదలుచుకొన్న దేదీ లేన ప్పుడు కథవ్రాయట మెందుకు? అపద్దతిమీద చూస్తే, ఈ సంచికలో ఒక్క టీకధ అని చెప్పటానికి వీలు లేదు. ఒకటి రెండు కథలలో ఉద్దేశాలు వున్నా చాలా సాధారణంగా వున్నవి. దక్షిణాం ంధ్ర ప త్రిక : ఈపత్రికను శ్రీ సాధు వరదరాజం పంతుల సతి సాధు జయలక్ష్మి అమ్మగారు మూడుమాసముల కొక పర్యాయము ప్రకటించుచున్నారు. మద్రాసు కోమలేశ్వరం పేటలో 16 చంద్రభానువీధి ప్రకటన స్థానము. సంవత్సర చందా ఓక్క రూపాయి, విడి ప్రతి 0-4-0. సంచిక 30 పేజీలు. ము ఈపత్రిక అరవఅక్షరాలలో తెలుగు భాషను ప్రకటిత మగుచున్నది. తెలుగురాక అరవమే చదువగల మన దాక్షి ణాత్యసోదరులకొరకిది సంకల్పించినది కావున సంపాదకు వర్డుకు రెండే కావడము చేత తెలుగు అవసరాలన్నిటిని లీమార్గమున కృషి చేయుచున్నారు. అరవములో అక్షరాలు తీర్చజాలవు. కాబట్టి వర్గ ప్రధమాక్షరంతోగూడ వేరే వేరే సంకేతాలు, ముఖ్యంగా 1, 2, 3, 4 అంకెలు చేర్చి గంధాక్షరములు స్వీకరించి వర్ణసమామ్నాయము పూర్తి చేసి తెలుగు, అరవము గుణింతము లిచ్చి, బాలశిక్ష యేర్ప రచి, దక్షిణాంధ్ర దేశీయాంధ్ర పదములకు ప్రత్యేకమ అరవ అక్షరములలో నే నిఘంటువును గూడ ప్రకటించి, మహా గొప్ప పరిశ్రమను ఈపత్రిక వారు చేయుచున్నారు. దేశీయాంధ్రులు ఆరవాక్షరము లెరుంగుదు లేని మనదక్షిణ సోదరుల భాషలోని వైశేష్యములను సులభముగా గ్రహిం చుట కీ నిఘంటువు తోడ్పడగలదు. క్రమముగా ఆరవ మే వచ్చిన మన దాక్షిణాత్య సోదరులు తెలుగును అక్షరము లతోగూడ నేర్చుకొనుట కీ సర్వ ప్రయత్నమును పనికి వచ్చును. ఈ భాషాప్రయత్న మొకటేగాక ఇతర వ్యాస ములు చాల ప్రకటించుచున్నారు. తమిళనాడు పత్రిక వ్రాసినట్లు ఈ దక్షిణాంధ్రపత్రిక దక్షిణ దేశములోని మన సోదరులకు గొప్ప యుప కారియై మాతృభాషాభినూ నమును పెంపొందించు ననుటకు సందేహములేదు.
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.2 (1936).pdf/40
స్వరూపం