24 98 గ్రంథాలయ సర్వస్వ ము .
తన కుతూహలము హెచ్చినదనుటకు అంగ్ల ఆంధ్రపత్రికల సంఖ్య 60 వరకు అభివృద్ధి చెందుటయే తార్కాణము. ఈ శాలమున ఈ సంఘద్వారమున విస్మరింపరాని ఉత్కృష్ట ఈ సేవ జరిగినది. అదేదన, 1916 సంవత్సరమున కొల్లేటి కరద వలన నష్టమొ మొందిన బీదసాదలకు మదరాసు కొలేటివరద నిధి వారు పంపిన రూ 200 లను ఈ సంఘ సభ్యులు కొందరు అవి పదంగమునకు వెళ్ళిఅర్తులకు గింజల రూపమునను, బట్టలరూపమునను, వివేచనముతో పంచి పెట్టి రనుటయే. మరొక్క విషయము. 1917 సం॥ చివర భాగమున ప్రకృతి పరిణామము- హైందవ సిద్ధాంతము” అను విషయమును గూర్చి కృష్ణాపత్రికారచయిత శ్రీ మాట్నూరి కృష్ణారావు గారు భావపూరితమగు ఉపన్యాము నిచ్చిరి. కలరా మున్నగు యంకర వ్యాధులు పురమును నాల్గుమూలల ముట్టడించి ప్రజలను వేధించుచుండిన దిన ములలో సంఘసభ్యులు కొందరు బయలుదేరి ఉపన్యాసము లిచ్చియు, వ్యాధిగ్రస్తులకు ఔషధాది పరిచర్యలు చేసియు నిర్వ్యాజమగు సేవయొనర్చిరి.
ఉగాదిపండుగ
1918 వ సంవత్సరము ఈ సంఘజీవనమునకు ఉగాది పండుగ. ఇంతవరకు ఈ సంఘమున జరుగుచున్న సరస్వతీ ప్రసన్న తనుగూర్చియే మీరువింటిరి. ఇపుడు లక్ష్మి సాక్షా త్కరించినదని, యీ సాక్షాత్కారమునకు ఈసంఘమును భరించిన మహాస్తూపములలో నొక్కడు ప్రజాహి తైక సేవాతత్పరుడు, వదాన్యుడునగు మద్దుల వెంక టచిన రాజు శ్రేష్ఠిగారు నూరు రూకల దక్షిణతో శతమానం భవతం శతాయు” అని అమృతాశీస్సు గావించిరి. వీరే సార్దక మైన ప్రధమశాశ్వత సభ్యులు. సంఘమునకు దినక్రమమున పుస్తకములు, ఇతర సామానులును పెంపొందుచుండుట చే జవాబుదారితో గూడిన జాగరూకత గల కాపుదారీ అవ సరమైనది. ప్రజాదరము అంతకంతకు పరివ్యాప్తియందు ఉన్నదని ఉత్సాహము కలుగుచుండినమాట నిజమ కాని వచ్చుబడికున్న వెచ్చము అధికమగుచున్నది. అంత ఆలన పాలనకును, అర్థికోషపత్తికిని అనువయిన సంఘ 'మొకటి మాపుర్వశ్య జమిందారుడు, వితరణ వినోది యగు రావుబహదూర్ మోతే గంగరాజుగారు శీర్షికగా ప్రతిష్ఠమైనది. ఈ ప్రతిష్ఠాపనమునకు ఆ వెంకట చినరాజు శ్రేష్ఠి అమృత సంకల్పమే నిశ్చల కార్యదీక్షయే కారణమనిన అతిశయోక్తికాదు. ఆది మొదలు సంస్థను నడపుటకు ఆవశ్య కములైన గన్నాహములు జరిగినవి. అట్లుస్ధాపింపబడిన సంఘమే నేడు ధర్మకర్తృసంఘము పేర ప్రవర్తిల్లుచున్నది. తరువాత జరిగిన తత్పరిణతిని గూర్చియు ఇంచుక విన్న వించు కొందుము. 500 రూపాయలు పూర్తీగా చెల్లించి శాశ్వత ధర్మకర్త అయినవారు. 1930 సం॥ న ద్వాదశార్కులవలె పన్నిద్దరు. ఇందు శ్రీకారము మద్దుల వెంకట శివరాజు శ్రేష్ఠి గా రే.రు500 × మీద వడ్డీ యిచ్చువారు చతుర్దశభువన ముల వలె పదునలుగురు. మొత్తము ఇరువది అగుగురు. ఇట్లే క్రనూభ్యున్నతినొంది నేటికి ధర్మకర్త సభ పూర్తిగ సొమ్ము చెల్లించిన పదునారుమంది సభ్యుల తోను," అంత మొత్తముమీద వడ్డీ నిచ్చు 17 సభ్యులతోను శాశ్వతపోషకులు మొదలు సహాయులు 52 సభ్యులతో ను విరాజిల్లుచున్నది. మరియు ఈ సంవత్సరముననే 1860 సం. 21 అక్టుప్రకారము లేఖ్యారూఢమైనది . శుభోత్కరము లైన యిన్ని సన్ని వేశములకు ఆకరమైనదగుట ఈ సంవత్సరము ఈసంఘము నకుఉ గాదిపండుగ. గు500లు వెచ్చించిమ్యాజిక్ లాంతరు నొకదానిని తెప్పించిరి. ఉద్దేశానుసారము పామఠ జనసామాన్యమున జ్ఞానమును పరివ్యాప్తము చేయుటకై దీనిని వినియోగించిరి. ఈ సంఘము యొక్క ఊన షోడశ వక్షోత్సవము (15) [1920 జనవరి 18, 19 వ తేదీలు] నకు అధ్యక్షతవహించిన శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు గారు ఇట్లు నుడివిరి.
" ఈ పురయువజనులు 1904 సంవత్సరమునందు కలి పయ గ్రంథములతో నారంభించిన గ్రంథాలయము పదు నైదేండ్లలో క్రమవికాసము బొందినది. ఆంధ్ర దేశము. నందుగల 530 గ్రంథాలయములలో ఈ గ్రంథాలయము పుస్తకముల ననుసరించి ఐదవదిగను, ఆదాయము గురించి ఎనిమిదవదిగను ఉండుట ఈపురవాసులైన యువ జనుల యుత్సాహమునకు నిదర్శనము. యువజనుల యు త్సాహమునకు విశేష ప్రోత్సాహమొసంగిన మోతేగంగ రాజుగారు మొదలగు పౌరులు మనకృతజ్ఞతకు బాత్రులు.
గృహ నిర్మాణము
ఈ సంఘమునకు మోతే గంగరాజు జమీందారు గారు స్వగృహమును నిర్మించెదమనిరి. ఏలూరు పురపాలక సంఘమువారు 2000 చ.గ. స్థలమును ఉచితముగా నిచ్చిరి. ఈ స్థలమునకు మ్యునిసిపాలిటివారు కోరినట్లు అద్దె క్రింద 30 సంవత్సరములవరకు సం॥ 1 కి రు 100 లు చొ॥ చెల్లిం తుమనియు, ప్రతి ముప్పది సంవత్సరములకు నూటికి 30 రూప్యములు మించని అద్దె వసూలు చేయవచ్చుననియు 25-10-20 సం॥ తేదీన సంఘము తరఫున మ్యునిసిపాలిటీకి రిజిష్టరు దస్తావేజు వ్రాయించి యీయబడెను. అంతట శంకుస్థాపన మయినది, స్థంభప్రతిష్ఠ వై మయినది. స్థంభప్రతిష్ఠ మైనది. మహారాజ