Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.4 (1916).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాచన సోమనాధుఁడు.

ఈ కవిని గూర్చి పలువురు చరిత్రకారులు ప్రక టించిన విషయములను ఖండించుచు ౧౯౧౭, ౧౯౧౮8 సంవత్సరములయందు “సువర్ణ లేఖ” పత్రికయందును, ౧౯౦ సంవత్సరమున గ్రంథాలయసర్వస్వము నందును వ్యాసములను వ్రాసితిని. శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులు గారు ఆంధ్రుల చరిత్ర మూడవ భాగమునం దీ కవిని గురించి వ్రాయుచు నేను ఖండించిన 3, ర విష యములలో మూడు విషయములఁ (అనగా ౦ కాలము ౨ కులము 3 తండ్రి పేరులను గూర్చి నేను వ్రాసిన విషయముల) జల్లగ సంగీకరించి, కాలము విషయములో సగము నా వాదమున కనుకూలముగ మఱలుచు వారి లేఖినికి స్వభావనుగు నించుక యావేశముతో నా వ్యా సమును ముగించిరి. ఒక మహాకవిని గురించిన మూడు ముఖ్య విషయములం దొక్క ప్రసిద్ధి వడసిన చరిత్రకారుని కనుకూలములగు విషయములను గని పెట్టి చూపితినని యు, నా కష్టము వృధకాలేదనియు సంతసించు చు న్నాను.

నాచన సోముఁడు శంభదాసునకుఁ 'బిమ్మటివాఁ -డను వాదము పూర్తిగాఁ బోయినను, సమకాలీనుని స్థా నమునకు దిగుట కంగీక రించినను, సోముఁ డెజ్జా పెగ్గడ హరివంశమును జూచిన పిమ్మట నది ప్రాణముగ లేదని తా నొక నూతన హరివంశమును ప్రకటించెనను నపవాద మా మహాకవిపై వేయుచున్నారు. నాచన సోముడు మ హక వియని యంగీకరించి శ్రీశ్రీ భద్రరావుగానే, యేమి వ్రాయు • 66 6 'చూడుడు. శ్రీముత్సక భూషణ రసపోషణ సంవిధా నచక్రవర్తి' యగు బుక్క రాయనిచే సన్మానిం పఁబడెను.” (మరి రెండు పంక్తులయిన ముగియకుండ స్వవచన వ్యాఘాతముగ శ్రీ వీ॥ రావు గారు వ్రాయునది చూడుఁడు.) "ఎఱ్ఱాప్రెగడయును నాచన సోముఁడును సమకాలికులు గావున నుభయులలో నెకరి గ్రంధము ముందు గచింపఁబడినదో చెప్పుట సాధ్యముకాదు. కాని యెఱ్ఱా ప్రెగడ నిరచితిమైన హరివంశమును నిన్న మీఁదటి నది ప్రౌఢముగ లేదను తలంపుతో నుత్తరహరివంశమును ప్రా సెనని యూహించుటకు గద్యములో “శ్రీమత్సకల భాషాభూషణ రసపోషణ సంవిధాన చక్రవర్తి" అని పెట్టుకొన్న పెద్ద బిరుదములే యవకాశ మిచ్చుచున్నవి.” (ఆంధ్రుల చరిత్ర. 3 భా. 3రం పుట.)

సంవిధాన చక్రవర్తియగుట చేతినే బుక్కరా యఁడు సన్మానించె ననిరి. మరల నాతఁడవి పెట్టుకొనిన (డంబముకొఱకు?) పెద్ద పేరు లనిరి. ఆమాటల క్రింద నే మరల “నాచన సోమనానుని కవిత్వము మిక్కిలి మైనది. ఈమహాకని కవిత్వ పటుత్వ సంపదను బట్టి యీతనికి సర్వజ్ఞుఁడని బిరుము పేరు వచ్చినది” అని వ్రాసి సోముని సుహాకవిస్వ స్థానము నంగీకరించి 3. సగ నకివి పెద్ద పేరులా? ఇట్లు వ్రాయుటక్కుల కారణ మేమి యో నాకు దురూహ్యముగనున్నది.

“గ్రంథాలయ సర్వస్వముయొక్క ప్రధమ సం చికలో నెఱ్ఱా పెగ్గడకంటె నాచన సోముఁడు పూర్వి కుఁడని నామిత్రులగు వంగూరి సుబ్బారావు గారు యత్నించిరి. కాని వారి ప్రయాసమంతయును వ్యర్థ ము." అనియు “నాచనసోముఁడు శంభుదాసునికంటెఁ బూర్వుఁడని వాదింపఁ దివురుట నేలవిడిచి సాము చేయు టవంటిది.” అనియు శ్రీ వీరభద్రరావుగా కనుచున్నారు.

నేలవిడిచిన సాము నాది యోగా వారిది యో తెలి యుటకై రెండు విషయముల మాత్రము మాప చున్నా :: ను. ఒకసారి శ్రీమానవల్లి రామకృష్ణ కవిగారును వీరభ ద్రరావు గారును కూడ సోముఁడు వృద్ధుఁడును, శంభుదా సుఁదు ఆతినితరువాతి వాఁడు నై యుండవలెనని యంగీక రించియున్నారు. అని మాటలు; ఆధారములు కాఁజాలక పోవచ్చును. ఇవి వ్రాతలు; కావున నుంచి యాధారముల తోనే సోమునికి జరుగవలసిన న్యాయ మొనరింతము.

క్రీ శ॥ ౧323లో ప్రతాపరుద్రుని రాజ్య మంత రించినది. ఆ పిమ్మట నాతని సేనాధిపతి ప్రోలయ విను