Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.4 (1916).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కథ - కలాపము.

ప్రధమ ఆుధ్రదేశ గ్రంథభాండాగార ప్రతి నిధుల సభ ౧౯౧ర స్రు. ఏప్రియలు నెల ౧౦ వ తేదీన బెజవాడ పట్టణమున, ద్వితీయ సభ ౧౯౧ సం. మే నెల ౭, ౮ తేములయందు రాజమహేంద్రవరమున జరిగినవి. ద్వితీయ సభ జరిగినది మొదలు నేటిదనుక గ్రంథాల యోద్యమము ఆంధ్ర దేశ మునం దెటుల వ్యాపిం చినదియు ముచ్చటించుకొందము.

ఈ వత్సరము బరంపుర మునందును, కడప జిల్లా ప్రొద్దుటూరునందును జరిగిన మండల సభలకు గ్రంథ భాండాగార సంఘపక్షమున కార్యదర్శి పోయి అచట ఈ యుద్యమమును గూర్చి పలువురతో ప్రసంగములను సల్సి అభిమానముక లుగునటులచే సెను, ప్రొద్దుటూ రునందు జరిగిన మండల సభయందు గ్రంథా లయములు లజిల్లాయందంతటను స్థాపించుట యొక్క ఆవశ్యకతను గూర్చి తీర్మాన మొకటి పెట్టబడెను. అందులనుగూర్చి పలువురు ఉప న్యాసములను ఒసంగిరి. కర్నూలు, చిత్తూరు, కృష్ణాజిల్లా రాచపట్నములయందు జరిగిన మండల సభలకు ఈ సంఘపక్షమున కొడాలి శివరామ కృష్ణారావుగారు పోయి ఆయాసభ లందు గ్రంథభాండాగారోద్యమము యొక్క ప్రాముఖ్యమునుగూర్చి జనుల కెల్లరకు బోధిం చిరి;. గ్రంథాలయములా యా జిల్లాలయందు స్థాపించుటయొక్క ఆవశ్యకతను గూర్చియు, ప్రభుత్వమువారు వాటికి చేయదగు సహాయ మును గూర్చియు తీర్మానములు జరుగుటకు కారణభూతులైరి. మఱియు గోదావరిజిల్లా రామచంద్రపురమున జరిగిన మండల సభకు ఈ సంఘపక్షమున దంటు కృష్ణమూర్తి గారు పోయి యుండిరి.

కడపజిల్లా ప్రొద్దుటూరు నందు మండల రాజకీయసభ జరగినప్పుడే, మండల గ్రంథా లయ ప్రతినిధుల సభకూడ గాడిచర్ల మేక ట్రావు పంతులుగారి ఆధిపత్యముక్రింద జర గినది. ఆసభయందు గవర్నమెంటువారిని ద్రవ్యసహాయముకొఱకు ప్రార్థించుచు రెండు తీర్మానములును, కడపజిల్లాకు గ్రంథ భాండా గార సంఘమును ఏర్పాటు జేయుచు మరియొక తీర్మానమును చేయబడినవి. ను చేయబడినవి. ఈ వత్సరము ఏప్రియలు నెల ౨౧ వ తేదీన గుడివాడయందు జరగిన మండలసభతో పాటు, కృష్ణా మండల గ్రంథాలయసభకూడ వల్లూరి సూర్యనారా యణరావు బి. ఏ. బి. ఎల్. ఎల్. టి; గారి అగ్రాసనాధిపత్యము క్రింద కూడినది. ఈసభ యందు కృష్ణాజిల్లాకును గుడివాడ తాలూ కా కును గ్రంథాలయసంఘము లేర్పాటు గావిం పబడినవి. కృష్ణాజిల్లా గ్రంథాలయ సంఘ మునకు భూపతిరాజు తిరుపతి రాజుగారు ౨ కొడాలి సత్యనారాయణగారు 3 దుగ్గిరాల వేంకటసుబ్బయ్యగారు కార్యదర్శులుగు నేర్పా టుగావింపబడిరి. గుడివాడ తాలూకా గ్రంథా· లయ సంఘమునకు దాసరి లక్ష్మీనారాయణ. A