Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.4 (1916).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ. జనసామాన్యమునందు విద్య వ్యాపింపఁ జేయుటెట్లు?

ఈయంశమునుగూర్చి ముచ్చటించునపుడు ముందు విద్యయన నేమో స్పష్టముగాఁ దెలి సికొనుట యావశ్యకము. ఇందును గూర్చి వివి ధదేశముల విద్వాంసులు వివిధ కాలములందు వేరువే రభి ప్రాయముల నిచ్చియున్నారు. పాశ్చాత్యదేశములలో మొట్టమొదట నా గరికతను వహించి జ్ఞానాధిక్యముచే వన్నె కె క్కినవారు గ్రీకులు. వీరు సద్వర్తనమును గూ ర్చియు సౌందర్యమును గూర్చియు సభ్యతను గూర్చియు ధృఢతరజ్ఞానమును గల్గియుంట వి ద్యయని నిర్వచనముచేసిరి. ఇట్టివిద్య శరీర 'వ్యాయాము ముచేతను, సంగీతము మొదలగు చిత్రకళలచేతను అభివృద్ధి మెందునని వారి మతము..

గ్రీకుల పిమ్మట పాశ్చాత్య ఖండమునందభి నృద్ధికి వచ్చినవారు రోము దేశస్థులు. ఈ దేశ పు విద్వాంసులు, న్యాయముత" ను విచక్షణ తోను ఔదార్యముతోను స్వకీయమైనట్టియు జనసామాన్యమునకు సంబంధించి నట్టియు, విధులను నిర్వర్తించగల శ క్తిని సంపాదించు కొనుటయేవిద్యయని నిరూపించిరి. ఆంగ్లేయదే శ విద్వాంసుఁడగు “మాంటేయిను” మనుష్య తత్వమునం దిమిడియున్న యుత్తమమగు గు ణములనన్నిటిని వ్యక్త పఱచుటయే విద్యయ ని రూఢి పఱ చెను.

ధృఢమైన దేహమున ధృఢమైన బుద్ధిని కల్గి యుండుట విద్యయని“లాకు” చెప్పెను. “బె యిను” మహాశయుడు న్యూ నాతిరిక్త భేదము . లేక మనుష్యుని యందిమిడియున్న శక్తులన్ని యు, సమరుగు నభివృద్ధిని పొందుటయే విద్య యని వక్కాణిం చెను.

ఇఁక" మన భారతీయులు విద్యాశబ్దమున కేమియర్ధము చెప్పిరో తెలిసికొనవలసి యు న్నది. నాగోజీభట్టు “పరమోత్తమ పురుషా ర్ధ సాధనీవిద్యా” అనియును “బ్రహ్మజ్ఞానరూపా విద్యా"అనియునిర్వచించినాఁడు.శి,కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, ఋగ్వే దము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము, మీమాంస, న్యాయము, ధర్మశా స్త్రము, పురాణము, ఆయుర్వేదము, ధనుర్వే దము, గాంధర్వవేదము, అర్థశాస్త్రము. అను నవి యన్నియు విద్యాశబ్ధముచే గ్రాహ్యము లని విష్ణుపురాణమందు తేల్చఁబడియున్నది.

పూర్వపశ్చిము విద్వాంసులందఱు విద్యా శబ్దమున కిచ్చిన యర్థములన్నిటిని కలిపిచూ చినచో విద్యాశ బ్దార్థమునుగూర్చి మన కేమి బోధపడుచున్నది? మనుష్యతత్వమునం దిమి డియున్న గుణములన్ని టిని న్యూ నాతిరి క భేద ములేకుండ వృద్ధిపొందించునది విద్యయని మ నకుఁ దెలియుచున్నది. ఈ మనుష్యతత్వము నందిమిడియున్న గుణములే పూ మనము తెల సికొన వలసియున్నది. శారీరకము, ధార్మికము బౌద్ధము, రాజకీయము, చిత్రకళానై పుణ్యము ఆధ్యాత్మికము అను నీయాఱు తత్వములు మనుష్యత్వము నందిమిడియున్నట్లు చెప్పవ చ్చును కావున ఈతత్వముల నన్నిటిని న్యూ. నాతిరి క భేదము లేకుండునట్లు అభివృద్ధి చేయు టయేవిద్యయని మనమిదివఱకు చేసిన చర్చకు