పుట:Grandhaalayasarvasvamu, sanputi 9, sanchika 4 january 1935.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బాలగంగాధర తిలక్ పుస్తకాలయము, పెదపులివర్రు,

రేపల్లె తాలూకా.

ఈ గ్రంథాలయము యొక్క త్రయోదశ వార్షికోత్సవము 14-11-34 తేదీనాడు శ్రీ చెరుకువాడ వేంకటనరసింహంగారి అధ్యక్షత క్రింద జరిగినది. అప్పుడు నివేదింపబడిన ఈ సంగతులను ప్రచురించుచున్నాము.

ఇది పదమూడు సంవత్సరములక్రిత మీ గ్రామమందు స్థాపింపబడినది. రూ. 130 లు విలువగల గ్రంథములను, రూ. 20 లు చేయు బీరువాను బ్రహ్మశ్రీ పండిత కాశీనాథుని రాజలింగశాస్త్రిగా రిచ్చిరి.

గ్రంథాలయోద్యమము యొక్క ప్రాశస్త్యమును గమనించి లోకోపకార మొనర్ప స్థితప్రజ్ఞఉలై కొవ్వూరునందుగల ఆంధ్రగీర్వాణ విద్యాపీఠమునకు రూ. 12,000 లు విరాళమొసగి వారు రచించిన గ్రంథములను మన గ్రంథాలయమునకు సహితము పంపుచు అభిమానమును వెల్లడించు మహానుభావులు శ్రీ వల్లూరి సూర్యనారాయణరావు పంతులు గారును పూజనీయులు.

సం||తములో 18 పాలకవర్గ సమావేశములును, 1 సన్మానసంఘ సమావేశమును జరిపి, 38 హంశములపై చర్చించి తీరుమానించినారు.

స్త్రీ విద్యావ్యాప్తికిగాను ప్రత్యేక నౌకరును నియమించి, నియమానుసారము పుస్తకముల నిండ్లకందించి స్త్రీల యందు విజ్ఞానమును వృద్ధి చేయుచున్నారు.

1400 లకు పైగా గ్రంథములు 5 బీరువాలు కలిగి 10 పత్రికలు తెప్పించుచు పాఠకులు దినదినాభివృద్ధి యగుచున్నారు.

ఈ గ్రంథాలయమునకు 10 పత్రికలు వచ్చుచున్నవి. ఈ సంవత్సరము దాతలు 389 గ్రంథములను దయతో నొసంగిరి.

ఈ గ్రంథాలయమునకు 1921 సం|| జూలైలో కాలువ లంకలపాటలకు గ్రామములో నున్న భిన్నభావములను బహు ఓర్పుతో నేకీభవింపజేసి ఆ పాటలమీద వచ్చిన ఆదాయమును ఖర్చులతో రు 966-00 వసూలు పరచి అప్పుకు ఉన్న జాతీయ విద్యాలయమునకు గ్రంథాలయమునకు జాయింటుగానున్న ఖాతాకు శ్రీ కనగాల కృష్ణయ్య చౌదరిగారు ఇప్పించిరి. 1924 సం||రమునకు రు 100 లు మొత్తము రు 200-00 లు వడ్డీతోసహా. ది. 3-10-34 భట్టిప్రోలు వసూలు (దసరాభిక్షలు)

శ్రీయుత భట్టిప్రోలు చంద్రశేఖరరావుగారు రు 0 అ 8

మద్దుల గిరిరావుగారు రు 1 అ 0

పాలకుర్తి సీతారామయ్యగారు రు 0 అ 8

మద్దుల నరసింహంగారు రు 0 అ 8