Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64


శ్రీవీరేశలింగపుస్తక భాండాగారము 1900 వ సంవత్సరమున రాజమ హేంద్రవరమున శ్రీయుత నాళము కృష్ణారావుగారిచే స్థాపింపఁబడినది. ఈభాండాగారము మొట్టమొదట తెనుఁగు పుస్తకములతో నారంభింపఁబడి, కొంతకాలమువఱ కేనామమును ధరింపకయె చిన్న పఠన మందిరమువలె నొప్పుచు, నచ్చటికి వచ్చుచదువరులకుమా త్రమె యుపయుక్తముగ నుండెడిది. సేవకుఁడు లేకపో వుటచే పు స్తకములనింటికిఁ దీసికొనఁ గోరువారికడ చం దాలగైకొని పుస్తకములిచ్చు పద్ధతి యప్పుడు లేకుండె ను. ఐనను పరిచితులగు కొందరకు చందాలేకయే పుస్త కములు వారిగృహములకీయఁబడు చుండెడివి. ఇట్లొకవ త్సరము గడిచినపిదప కీర్తిశేషులైన శ్రీనాళము జగ్గారావు గారు భాండాగారాభివృద్ధికై పూనుకొని కేవల మొక్క యాంధ్రగ్రంధములతో నే భాండాగారము సంపూర్ణమైనది కాదనియెంచి, యందాంగ్లేయ గ్రంధములు గూడ పెక్కిం టిని జేర్చిరి.

అప్పు డీభాండాగారమునకుఁ దగిన నామ మొసం గు తరుణము వచ్చినదని యెంచి, తదీయ స్థాపకులును నభిమానులును జేరి “శ్రీ వీరేశలింగ యువజన సమాజము ” అను పేరనొక సంఘముగ నేర్పడి, భాండాగారమును ద మయధీనమున నుంచికొని, దానికి “శ్రీ వీరేశలింగ పుస్తక భాండాగారము” అని నామకరణ మొనర్చిరి. తోడ నే యొక చిన్న మేడ యద్దెకుఁ దీసికొనఁబడి యందీ భాండా గారము నెలకొల్పఁబడెను. సేవకులు నియమింపఁబడిరి. పౌరులకడ చందాలఁ గైకొని వారికింటికి పుస్తకములు నిచ్చుపద్ధతి యవలంబింపఁబడెను. స్త్రీల కుచితముగ వా రి గృహములకు పుస్తకముల బంపుటయారంభింపబడెను. మఱియు నీ సమాజము మత సంఘసంస్కార విషయముల మొక్కవోనిదీక్ష వహించి తద్వ్యాప్తికై యనేక సభలఁ గావించియు, కరపత్రములను పొత్తములను వెలువరించి యు, భాండారాభివృద్ధికై నిరంతరము పాటుపడుచు, సుమారు 8 వత్సరములు తృప్తికరముగఁ గార్యములు నిర్వ హించి 1909 వ సంవత్సరమున విరమించెను.

అంత నీభాండాగారమును గూర్చి మొదటినుండి యు కృషి చేయుచున్న కొందఱు వేఱక సంఘముగ నే ర్పడి నూతన నిబంధనలను పద్ధతులను నేర్పఱచి ఆరు సంవత్సరములనుండియు శ్రద్దతోఁ బనిచేయుచు కొండా గారమును ప్రస్తుతాభివృద్ధికిఁ గొని తెచ్చిరి. ఇప్పుడీ బాం డారము పురమందిరము నందలి ప్రార్ధనసమాజ సౌధమున నలరారుచు, 42 గురు సామాజికులను, 218 మంది చం దాదారులను, 144 మంది స్త్రీ చదువకులను గలిగి 2200 ఆంధ్రగ్రంధములతో, 1900 ఆంగ్లేయ గ్రంధములతో, 228 సంస్కృత గ్రంధములతో, 55 తాళపత్రగ్రంధములతో నొప్పుచు, 53 ఆధ్రాంగ్లేయవార్తాపత్రికలచే నలంకరింప బడి, యనుదినము 30 మంది చదువరుల నాకర్షించుచు న్నది.

ఈభాండాగారము యొక్క ప్రధానో దేశములలో స్త్రీవిద్యాభివృద్ధి యగ్రగణ్య మైనది. ఈభండాగారము స్థాపించినది మొదలు నేఁటిదనుక స్త్రీలకు వారు కోరు పొత్తముల చందా గ్రహింపకయె వారినిలయములకు గ్రం ధాగార సేవకునిచే బంపి స్త్రీవిద్యను ప్రోత్సాహపఱచు చుండిరి. దీనికై ప్రత్యేకముగ నొక సేవకునిఁ గూడ నియ మించియుండిరి. ప్రస్తుతము 144 గురు నారీమణులు ఈ భాండాగారగ్రంధముల నుపయోగపఱచుచున్నారు. గత వత్సరమున సుమారు 2785 ఆంధ్రగ్రంధములు వీరిచేఁ బ ఠింపఁబడినవి. స్త్రీవిద్యను ప్రోత్సాహపరచుటకై గత వత్సరమునుండి స్త్రీలకు బహుమాన పరీక్షలు గావించు చున్నారు.

విజ్ఞానవల్లరిఅను పేరున నీతిబోధకములు జ్ఞానదాయ కములునగు కరపత్రములు నాలుగువత్సరములనుండి ఈ భాండాగారపక్షమున మాసమునకొక సారి ప్రచురింపఁబడు చున్నవి. జనసామాన్యము యొక్క హృదయ పీచులందు సుజానబీజముల నాటుట యీకరపత్రముల ముఖ్యోద్దేశ మై యున్నది. దీనికి శ్రీపాలపర్తి నరసింహము గారు కా ర్యదర్శిగా నియమింపఁబడిరి. مه గ్రంధభాండారముల కముద్రిత గ్రంధము లమూ ల్యాలంకారములు, ఒక పుస్తక భాండాగారము యొక్క యుత్కృష్టత యందలి యముద్రిత గ్రంధముల యొక్క సంఖ్యను బట్టి నిర్ణయింపఁదగును. ప్రాచ్యలిఖిత పుస్తక భాండారముల యొక్క ప్రయోజనము లనంతములు. ఇట్టి భాండాగారములు ప్రతిపట్టణమున ప్రతి గ్రామమున నెల కొలుపఁబడవలయును.