Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

61

వారిగృహములకు వీరినౌకరుచేతనే గ్రంధముల నంపుచున్నారు. ప్రస్తుతము 24 గురు స్త్రీలు మాత్రము ఈలాభమునుపయోగించు కొనుచున్నారు.

ప్రార్థన సమాజము.

ఈభాండాగారమునకు కొనబడిన నివేశన స్థలము నకు శ్రీ పాటిబండ సుబ్రహ్మణ్యం గారు రు 500 ల విరాళ మొసంగియున్నారు. వారికోరిక ప్రకారము బెజవాడ ప్రార్థన సమాజమువారు మందిరమును నిర్మాణము జే సుకొనుటకుగాను ఒక మూలను 200 చ. గజమ్ముల స్థలమునిచ్చిరి.

ఆంధ్రదేశ గ్రంధ భాండాగార ప్రతినిధుల మహాసభ.

మన ఆంధ్రదేశము నందుగల గ్రంథాలయముల నన్నింటికిని పరస్పర మైత్రికలిగిన మిగుల లాభముగ నుం డుననియు, భాండాగారములయొక్క అభివృద్ధికి సాధన భూతముగ నుండుననియు తలంచి 1914 ఏప్రిలు 10 వ తేదీన, ఈభాండాగారముయొక్క యాదరణ క్రింద బెజ వాడ పట్టణమున “ప్రధమ ఆంధ్రదేశగ్రంథ భాండాగా ర ప్రతినిధుల మహాసభ" గావింపబడినది.

ఇప్పుడీ భాండాగారమునకు 130 చందాదారులును 24 మంది స్త్రీచదువరులును గలిగి పదునాలుగు వందలు ఆంధ్రఆంగ్లేయ సంస్కృత గ్రంధములతోను ముప్పది నా లుగు ఆంధ్రాంగ్లేయ వార్తాపత్రికలతోను నలంకరింప బ డి యనుదినము ముప్పది మంది చదువరులు నాకరింపు చు న్నది. ఈభాండాగారముయొక్క భవనము తయారగు టకుసు, గ్రంధములను గొనుటకును పదివేల రూపాయ ల యిన గావలెనని మదింపు వేయబడినది. ఈ గ్రంధాలయ మిట్టి యున్నతస్థితిని వహించుటకు అగ్రాసనాధిపతుల కార్యదవీతయు, కార్యదర్శుల నిరంతరపరిశ్రమయు నై యున్నది. ములు.

ఈగ్రంథాలయముయొక్క ముఖ్యోద్దేశములు.

రాజా రామమోహన కాయులవారి యొక్క జాపకార్థ మీ భాండాగారము స్థాపింపబడినది,

1. ధర్మభాండాగారములను, పఠనమందిరములను బెజవాడపురమున స్థాపించుటయు కృష్ణా, గుంటూరు జిల్లాలయం దితరస్థలములలో స్థాపింపబడినవానిని దీనికి జేర్చుకొనుటయు,

2. చందాలను జెల్లించు చందాదారులకును, స భికులకును పుస్తకములను, పత్రికలను యెరువిచ్చుటయు,

3. సాంఘిక సమావేశములవలనను, ఉపన్యాస ముల మూలమునను ముఖ్యమగు విషయములం గూర్చి చ ర్చలను జరుపుట చేత, స్వస్థానమునందున్నట్టియు, ఇతర స్థలములయందున్న ట్టియు జనులయందు పరిచయము సభి వృద్ధిజేయుటయు,

4. భరతవర్షీయుల ఉత్సవములను, కవులయొ క్కయు, ప్రవక్తల యొక్కయు, తత్వజ్ఞానవేత్తలయొ క్కయు సాంవత్సరీకోత్సవములను జరుపుటయు,

5. విద్యావిషయిక ప్రతిస్థాపనలను స్థాపించుట యు, ఇదివరకే స్థాపింపబడిన వానిని దీనికి జేర్చుకొను టయు,

6. భాష, మతము, శాస్త్రము, పరిశ్రమ మొ దలగు విషయములను గూర్చి జనసామాన్యమున కుపన్యా సముల నొసంగుటయు; జనసామాన్యమునకు జ్ఞానాభి వృద్ధి కరములగు కరపత్రములను, పుస్తకములను బ్రచు రించుటయు; పై విషయములకు వ్యతిరిక్తము గానట్టి యు జనసామాన్యమునందు జ్ఞానాభివృద్ధి గల్యుజేయున ట్టియు ఇతర పద్ధతుల నవలంబించుటయునై యున్నవి.

సమస్యలు.

1. మ. కులమున్ బాణముగొట్టగా నణగె బెక్కుల్ వర్ణ ముల్ గంటివే. 2. చీమ తుమ్మెగదరా దిగ్గంతులల్లాడగన్. ణ