Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లయములు నది సాధ్యముకాదు. మఱి యంతగాఁ గోఱఁ దగినదియును గాదు. కాఁబట్టి యట్టి గ్రంధాలయమున నే యేగ్రంధముల నుంపవలయుననులు చక్కఁగా నాలోచిం పఁదగిన విషయము. దుర్ణీతులఁ గఱపునట్టి గ్రంధముల గ్రంథాలయముఁ జేరనీయకుండుట క్షేమము. గ్రంథాల యము యొక్క స్థితిగతులను నుపపత్తిని అనుసరించి దొ ఱకఁగల గ్రంథములలోనుండి యుచితములగు గ్రంధము ల నేర్పఱచుకొనవలెను. కేంద్ర గ్రంథాలయమున మాత్ర ము భాషలోనియన్ని గ్రంథములుండుట యుక్తమని చె ప్పియుంటినిగదా? ముద్రిత గ్రంథములు ద్రవ్యసాధ్యములు. అముద్రిత గ్రంధములు కేవల ద్రవ్యైక సాధ్యములుగావు. ఇ దివరకట్టి గ్రంధములుఁజేర్చియుండు విద్యారసికులు మహా నుభావులందఱును దోడ్పడిన గాని సాధ్యముకాదు. ఇంక ముద్రించు గ్రంధముల విషయములోఁ బ్రభుత్వమువారు ను భాషాభిమానులకు ముద్రించువారును గ్రంధకర్తలును దాముముద్రించు ప్రతిగ్రంథము యొక్క ప్రతిని మన కేం ద్రగ్రంథాలయమునకుఁ బం పెద లేని వారు మిక్కిలి సహా యము చేసినవారగుదురు.

పత్రిక.

గ్రంథాలయమున కను బంధముగ గ్రంథాలయ వి వయమును గ్రంధవిమర్శనములను బ్రచురించు మాసపత్రి కయో వారపత్రికయో యొకటియున్న యుక్తముగానుం డును. కాలక్రమమున నట్టివిమర్శనయందు తేలినగ్రంధ ములు మాత్రమె పఠనీయ గ్రంథములు గాఁ గావచ్చును. ఆంధ్రరాష్ట్రమునఁ బ్రత్యేక విశ్వవిద్యాలయమునకై మ నము జేయు ప్రయత్నము సఫలమగు నేని కేంద్ర గ్రంథాల య మావిశ్వవిద్యాలయమున కనుబంధముగ నుండఁదగు.
మహాజనులార! గ్రంథాలయ ప్రయత్నము ద్రవ్యై కసాధ్యమనునది తమకు సమర్పక మె. ఆంధ్రులలో ప్రభు వులు ధనికుల నేకులుగలరు. శ్రీమాననీయ పీఠికాపురప్రభు ప్రభృత లయాచితముగఁ దమ సానుభూతిని నుదార దాతృత్వమును గనబఱచియితరులకు మార్గదర్శకులై యు న్నారు. అధైర్యపడి నక్కఱలేదు. సర్వేశ్వరుఁడు గ్రం థాలయ ప్రయత్నమును సఫలము జేయుఁ గాత,


శాయాజీ గాయక్వార్, బరోడా మహారాజు.

హిందూదేశ గ్రంథభాండాగారోద్యమమునకు కల్పతరువు.

శా. రాజన్నక్ బ్రజలన్న నెట్టుల భువి♦రాణింపనౌనన్న వి
భ్రాజత్కీర్తి దిగంతరుండు బడొదా ♦ రాజన్యుని శాయజీ
రాజానామకు డెందము దలపగా ♦ రాదేసమాధాన మ
ట్లే జేయంగన రాజు లెల్ల ఁ బ్రజల ♦ ట్లే సౌఖ్యమున్ జెంద రే.

సీ. వ్రాలెఱుంగనివాడు ♦ రాజ్యమందుండగా రాదటంచన . రాజు కౌను
గ్రంధాలయము లేని ♦ గ్రామంబు కుగ్రామ మదిలేని రాజ్య మే. యధిపుడేలు
భూ ప్రదక్షణము నే♦భూపుండుపలుమారు సలిపి రాజ్యముల పుంసలనుగాం చె
ఉన్న ది చెడకుండ♦ను పరిమంచివియెంచి రాజ్యాననిల్పె నే రాజమౌళి

గీ. అతడు లండనుటైమ్సాది♦వితతపత్రి | కాగ్రసంస్తూయమాన వి♦ఖ్యాతయశుడు
శేషభారత రాజ్య వి♦భూషణంబు | ఆశలకుతావు మనకు శా♦యాజిరావు.