Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

గ్రంథాలయమన నేమి? అది చేయదగిన ధర్మము లెవ్వి?

గ్రంథాలయమన గ్రంథములనన్నిటిని ఒకచోట జేర్చి పెట్టునట్టి గృహమనియు, అట్టి గృహమునందున్న గ్రంధములనన్నిటిని దాచి జాగ్రతగ కావలి కాయునట్టి పురుషుడే గ్రంధభాండాగారియనియు ఆంధ్రప్రపంచమునందు చాలమంది తలంచుచున్నారు. పండితులు మాత్రమే అట్టి గ్రంధాలయములకుఁబోయి వాటినుపయోగింప నర్హులని గూడ వారి యభిప్రాయము.

అట్టి యభిప్రాయములు ప్రబలియుండుటకు గారణములు లేకపోలేదు. దినదినాభివృద్ధి గాంచుచున్న యీ నాగరక కాలమున పాశ్చాత్య దేశముల యందీ గ్రంధాలయోద్యమఎన్ని ముఖములనో పనిజేయుచున్నది. ఇదిదెలసికొని యుండకపోవుట, దీనికొక అనేకకారణములని యూహించుట కవకాశములు పెక్కులు కలవు.

వివిధశాస్త్రవేత్తలచే వ్రాయబడిన గ్రంథముల నొకచోట సేకరించి యుంచుటయే గ్రంథాలయము యొక్క పనిగాదు. పాశ్చాత్య దేశములయందు పుస్తకములనము పెద్ద దుకాణములనన్నిటియందును గూడ అక్కడకువచ్చు జనులెల్లరును ఉచితముగ జదువుకొనుటకు గాను కొన్ని గ్రంధముల బీరువాలుండును. ఇంతేల, మిఠాయి దుకాణములయందును పానీయములనమ్ము, దుకాణములయందును తుదకు మంగలి దుకాణములయందునుగూడ, ఆయాదేశములందు బ్రకటింపబడు సుప్రసిద్ధ వార్తాపత్రి కలుండును. ఆయాసరకులను కొనుటకు బోవువారెల్ల కొంచెము కాలమక్కడ విశ్రమించి వానిని జదువుకొనవచ్చును.

అట్లయిన, మన దేశమున గల ధర్మగ్రంథాలయముల నిర్వాహకులు పాశ్చాత్య దేశముల యందలి దుకాణదారులకన్న ఎక్కువగ జేయుచున్న పనియేమి? ఆదేశములయందలి స్థితిగతులకును మనస్థితిగతులకును జాలవ్యత్యాసమున్నదని మీరందురేమో! ఆమాట సత్యమే. అయినను మనస్థితి గతుల కనుకూలములగు పద్ధతులనెల్ల అనుసరింపవలసియుండుట మనకు' విధ్యుక్తధర్మముగాదా?

జనులయందు జిజ్ఞాస దినదినాభివృద్ధిని గావించుటయు, పలువిషయములయందు వారిక భిరుచినిగల్పించుటయు, సామాన్యజనులయొక్క హృదయములను విశాలవంతములుగను వికాసవంతములుగను అగునట్లు జేయుటయు గ్రంధాలయము యొక్క ముఖ్యధర్మములై యున్నవి.

పాఠశాలయందు విద్యాభ్యాసము జేసినట్టి జనులయందు బహుస్వల్ప భాగము మాత్రమే ఉన్నత విద్య నభ్యసించిన వారై యున్నారు. నూర్గురు విద్యాభ్యాసము జేసిన అందు నలుగురైన ఉన్నతవిద్య నభ్యసించినవారుండుట అరుదు. ఇట్టివారందరికిని గ్రంధాలయమే ఉన్నత విద్యాలయమై యున్నది. పాశ్చాత్య దేశముల యందు వ్రాయను జదువను జేతకానివారుండరు. అక్కడ విద్య నిర్భంధము. అందు విద్యాదేవత తాండవమాడుచున్నది. అట్టిదేశ ములయందు నీ గ్రంధాలయోద్యమ మెంతవర