Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

II

విన్నపము

భగవదనగ్రహము వలన గ్రంథాలయ సర్వస్వమును యొక్క నాలుగు భాగములును ప్రకంటించి, ప్రధమ సంపుటమును ముగించగలిగితిమి. గ్రంథాలయోద్యమ వివిధ దశలను గూర్చి విపులముగ బోధించునట్టు ప్రతిభాగమునందును ఆయా విషయములను ప్రత్యేక పరిశ్రమ జేసిన సమర్ధులచే రచింపబడినవి. ఈ వ్యాసములందు, పాశ్చాత్య దేశములయందు, బరోడా రాజ్యమునందు గ్రంథాలయోద్యమము బహుముఖముల పనిజేయుచున్నదియు చూపబడినది ఈఆయాదేశములయందు యుద్యమ ప్రచారము కొరకు అవలఁబింపబడుచున్న అభివృద్ధి మార్గములు మనకు అనుగుణముగ నుండునటుల అనుభవసిద్ధముగ వివరింపపబడినవి. ఆంధ్రదేశమునందు స్వంతభవనములు యున్న గ్రంథాలయముల చరిత్రములను గూడ ముద్రించుచున్నారము.

ఆంధ్రసారస్వతాభివృద్ధి మార్గములను దెలుపునట్టి, మహాపురుషులు జీవిత చరిత్రలను దెలుపునట్టియు వ్యాసములు సవర్ధులగువారిచే వ్రాయబడినవి. చారిత్రిక అంశాలతో గూడిన వ్యాసములు ప్రతిసంచిక యందుకాననగును. ప్రాచీన నవీన గ్రంధములయందు పాత్రల ఔచిత్యమును విమర్శించుటకు ప్రయత్నములు సలుపబడినవి. నవ్యరాగముల మ్రోగుచున్నవాణికి బూజ్యస్థానమిచ్చితిమి. ధ్వని మోహనము వంటి వ్యాసములు ప్రచురించి, ఆధునికి కావ్యవికాసమునకు దోహదము గల్పించితిమి. ఉదాత్తమునకు సమసుందరమునగు సాహిత్యచర్చ ప్రారంభింపబడి మఱచిపోయిన కవులయొక్కయు, మాసిపోయిన ప్రపంచము యొక్కయు అభిజ్ఞాన ప్రసారమును కలిగించుటకు అవకాశములొసగితిమి. సోదర భాష యందు రసరమణీయములగు కవులయు భక్తులయు గీత స్వభాషాముఖమున వినిపించుటకు తలపెట్టితిమి. కావ్యమునకు సహజ బాంధవియగు చిత్రకళనుజ్జీవించటకు గూడ కొంత సంకల్పించితిమి. ఇందలి వ్యాసములనేకములు రచయితల గాఢపరిశ్రమను సూచింపకపోవు. ఇదంతయు శుభమయిన అభ్యుధయము. ఏల్సిఁపోషణమే నిర్వాహకఁసంకల్పము. సూచింపక పోవు.

'సర్వస్వము'ను నిర్విన్నముగ నిర్వహించుటకు దొడ్పడిన లేఖకులకును, పోపకులకును కృతజ్ఞులము. శ్రీ పిఠాపురము రాజాగారు తమ ఔదార్యముతో, నూరురుపాయల వార్షికమును రాజపోషణచే మాకు కేలూతనొసంగిరి.