Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2


ఆంధ్ర గ్రంథాలయోద్యమము.


రెండవ ఆంధ్రగ్రంథాలయ మహాసభయందు సూరి వేంకటనరసింహముగారిచే చదువబడినది.

ఆంధ్రదేశ గ్రంధభాండాగార సంఘమువారిచే బ్రచురింపబడిన గ్రంథాలయ చరిత్ర వలన కింది సంగతులు తెలియుచున్నవి. ఆంధ్రదేశమున రమారమి 160 గ్రంధాలయములున్నవి. అందురమారమి 30 వరకు 1914 ఏప్రియలు నెల మొదలు యిప్పటివరకును కొనవియైయున్నవి. మొత్తము గ్రంధాలయములలో నైదు స్త్రీల యుపయోగము కొరకు స్త్రీలవలననే స్థాపింపబడినవియై యున్నవి. తక్కినవాటిలో చాలా సంఘములయందు పురుషులును స్త్రీలునుగూడ సామాజికులున్నారు. ఈ సంఘములన్నిటియందును సామాన్యమున కందఱకును ధర్మముగా పుస్తకములను, వార్తాపత్రికలనుపయోగించను నధికారముండియున్నది. 19 సంఘాలకు స్వంత భవనములున్నవి. 12 సంఘములచే పాఠశాలలుగూడ నిర్వహింపబడుచున్నవి. 22 సంఘముల యాజమాన్యము క్రింద పురాణపఠనము జరుగుచున్నది. కొన్ని సంఘములవారు మాజిక్కులాంతరు సహాయముతో ప్రజాసామాన్యమున కుపయోగమగున ప్రకృతిశాస్త్రములను గూర్చియు ఆరోగ్య శాస్త్రమునుగూర్చియు నీతిసంబంధమైనట్టియు ఉపన్యాసముల నిచ్చుచున్నారు. గంజాంజిల్లా భయను పట్టణమందలి గ్రంధాలయ సంఘము గ్రామమునందు దీపములు పెట్టుటకు సదూపాయముల నేర్పరచి పట్టణ పారిశుద్ధ్యము గూర్చిగూడ పాటుపడు చున్నట్లు తెలియుచున్నది. ఒక సంఘము వారిచే పారిశ్రామిక వస్తుప్రదర్శనము జరుపబడినది. పది సంఘములవారు బహుమతీ పరీక్షలను జరపి తన్మూలమున విద్యాభివృద్ధికి దోడ్పడుచున్నారు. నాలుగు సంఘములవారలు గ్రంధముల యొక్కయు కరపత్రముల యొక్కయు ప్రచురమును బూనియున్నారు. ఈ యంశములన్నిటి వలన ఈ యుద్యమము యొక్క స్వరూప స్వభావములను గూర్చి మన కేమిబోధపడుచున్నది? ఈ సంఘములు స్థాపింపవలెనని ఎవరుపదేశము చేసిరి? ఈ సంఘములను స్థాపించిన వారలెవరు? దొరతనము వారివలన బిరుదులను సంపాదించు యాశయా వీరినీ యుద్యమమునకు బురి కొల్పినది? ధనవంతులమన్న నయా? లేక ద్రవ్యాభిలాషయా? ఈసంఘముల స్థాపకులను సంరక్షకులను ఈ యుద్యమ విషయమై బూనుకొనుటకు ప్రేరేపించిన మహాశక్తి యెద్ది? వీరుబడయగోగుమన్న యెద్ది? వీరు వాంఛించు ఫలమెద్ది? ఈ ప్రశ్నలన్నిటికిని మనము జవాబు నీయవలసియున్నది.

ఈ యుద్యమమునకు ప్రేరకము తానుబాగై తనతోడి వారలను బాగుచేయవలెనను మనుష్య స్వభావమున నాటియున్న తీవ్రమగువాంఛయేయనియు, ఈయుద్యమ ప్రచారకులు కోరుఫలము తామును తమతోడివారును జ్ఞానాభివృద్ధివలన పొందెడు యానందము కంటే వేరొండు కాదనియు వీరినీ యుద్యమమునకు పురికొల్పు మహాశక్తి ప్రపంచాభివృద్ధి కొరకు అప్పుడప్పు డావిర్భవించు మహదుద్యమములను పాదుకొల్పి, వానికి జవసత్వములను గ