Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

86

The Telugu Romantic Poetry అపూర్వములు రసప్రధానములు !!

గ్రంథాలయముల నలంకరింపవలసిన పంచరత్నములు

రాయప్రోలు సుబ్బరాయ కవీంద్రునిచే రచియింపబడినవి

ఇట్టి గ్రంధము లిదివఱకు తెలుగులో లేవు. భావనలు నూతనములు. కల్పనలు విచిత్ర బుద్ధికుశలములు. భాషాశైలి సరళమధురము. నవ్యకవితా సౌందర్యము తెలియఁగోరువారు వీనిని చదివితీరవలెను. అందమైన ముద్రణము మనోహరమగు ఆకృతి.

1 తృణకంకణము భంగమనోరధులయిన పడుచు మిత్రులు పరస్పర సంభాషణము. ఇందలి స్త్రీ వర్ణన మెందును చదివియుండరు. విరహోత్కంఠుఁడై న పడుచువాని స్వగతవిలాపము వర్ణింపతరముగాదు. మైత్రీ విశ్వాసమున కొన్ని కన్నీళ్ళువిడచి, తృణకంకణము కట్టుభాగము అతికరుణము.

2 కష్టకమల 30 & 0-4-0. ఒక పండితకుమారి యాగంతుక మరణము. బ్రాహ్మణులయింటితోఁట వర్ణనము వర్ణనము నిసర్గ మనోహరము. గొడ్డురాలయిన పూర్ణమాంబ కడుపుకోతలు చెప్పనలవి గాదు "అట్లతద్దె” వర్ణనమిందలి యందములలో నందమైనది. ఇది చదివిగాని వినిగాని కనులనీరు పెట్టనివారు లేరు. వేల 0.4.0.

3 స్నేహలతా దేవి ఇల్లుకుదువఁ బెట్టి వరదక్షిణ చెల్లించ నెంచిన తండ్రి దురవస్థ నెరిగి, అగ్నిహోత్రుని కన్నతండ్రివలె కౌఁగిలించికొని శాంతించిన ఒక వంగదేశ కుమారి చరిత్రము. ఈపుస్తకము యొక్క సురుచిర సంప తిచదివి యనుభవింప వలసినదే. స్నేహలతాదేవి రూపపటము ఇందుఁగలదు.

4 తెనుఁగుతోఁట e & 0-4-0. ఆంధ్రబాలను సంబోధించుచు అనేకవిషయములిందు ధ్వని మనోహరములుగ వర్ణింపఁబడి యున్నవి. ఒక్కొక్కగీతి యొక్కొక్క చిత్తసంస్కారమును హృదయంగమముగ నొనర్చును. గీతాసఖ్యపు పాటలత్యంత రసవంతములు.

5 స్వప్నకుమారము వెల రు 0_4_0. ఇందు ప్రేమస్వరూపము రసస్ఫుటముగాఁ జిత్రింపఁబడినది. 'చింతా పుష్పము' లేరు ప్రణయుని భావరక్తి చదివితీరవలెను. పూలు విచ్చినట్లు విచ్చు మనో వేదన లిందు స్వభావసిద్ధములుగా వర్ణించారు . ఈగ్రంధములు వలయు వారిట్లు వ్రాయవలెను. మేనేజరు అభినవ కవితామండలి, బెజవాడ.