| శీలకారుణ్యగుణములఁ జెలఁగువాఁడు, రమ్యగుణమండనుం డైనరాఘవుండు. | 2216 |
తే. | అట్టి రాజలలామున కెట్టిదుష్ట, కాంత యైనను వశవర్తి గాక యున్నె | 2217 |
సీతాదేవి యనసూయాదేవిని బ్రస్తుతించుట
తే. | నిరుపమసంపత్కరమును, బరమసుఖాస్పదము భూరిభద్రప్రదము | 2218 |
తే. | సువ్రతంబునఁ బతికి శుశ్రూషఁ జేసి, మున్ను సావిత్రి దేవతాముఖ్య యయ్యె | 2219 |
తే. | ధర్మచారిణి సర్వసుందరులలోన, నుత్తమయు దేవతాప్రమదోత్తమాంగ | 2220 |
క. | జగతి న్భర్తృదృఢవ్రత, లగుయువతులు దేవలోకమందు స్వకీయం | 2221 |
క. | అని యిట్లు పలుక సీతా, వనితావాక్యముల కలరి వారనికృప న | 2222 |
క. | నానావిధనియమంబుల, మానుగ సంభూత మైనమహనీయతపో | 2223 |
అనసూయ సీతకు దివ్యవస్త్రమాల్యాభరణాంగరాగానులేపనంబుల నొసంగుట
వ. | దేవి మనోజ్ఞం బైనభవదీయవాక్యంబు విని యానందించితి నింకఁ బ్రీతిదా | 2224 |
తే. | అతివ యీదివ్యవస్త్రమాల్యాభరణము, లింపు సొంపార మేన ధరింపు మిపుడు | 2225 |
తే. | దేవి మద్దత్త మైనయీదివ్యలేప, నాంగరాగంబుచే విలిప్తాంగి వగుచు | 2226 |
క. | అని సాదరంబుగా ని, చ్చినఁ గైకొని మేనఁ దాల్చి చెలువుగ వసుధా | 2227 |
వ. | ఇవ్విధంబున నభూతపూర్వశోభావిశేషంబున నలంకృత యై యవ్వైదేహి | 2228 |