పుట:Goopa danpatulu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
38

గోపదంపతులు.

కంపెనీ యజమానులు విరివిగా దెలియజెప్పుచు బసకుం గొనిపోయిరి.

     ఈరీతిగా నాగొవులొక కుగ్రామమునుండి మహానాగరికా ప్రబావముచే వెలయు పట్టనరాజములో నికి గొంఫోబడిరి. స్దలభేదము వారి భావములకెట్టి మార్పాటు గల్గించునో ముందు గమనింతుము.

5. నాగరికత

గంగమ్మయు నప్పలసామియు గోపాలపట్టణములో నున్నప్పుడు ప్రాత:కాలమున, రాత్రిపాలలోదోడు పెట్టి యుంచిన యన్నముం దినునలవాటుగల వారిని మున్ను వచించియే యున్నాము. చెన్నపురికి వచ్చిన తర్వాత వారాయలవాటు విడిచి వెన్నరాచిన రొట్టే యించుకతిని కాఫీ త్రాగమొదలుపెట్టిరి. గంగమ్మ కింటిపనికొంత, వాడుకపాల్సెరుగు లిచ్చు పనికొంత, యుండుటచే దేహపరిశ్రమ యించుక గల్గుచుండెడిది.ఇప్పుడట్టి పని లేకపోవుటచే సొమరితన మబ్బింది. పరిశుభ్రములైన నేయిమజ్జిగ లతో నేపూట కాపూట కోసితెచ్చిన లేగూరలతో దంపుడుబియ్యపు టన్నముందిను నభ్యాసముగల్గు వార లిప్పుడు రాలతొను పురుగులతొను గూడిన ఫాక్టరీ బియ్యపు బోజనమును గంపునేతితోను నిలువ మజ్జిగతోను