పుట:Goopa danpatulu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
166

గోపదంపతులు.

      అప్పటికి జంద్రోదయము కానున్నది. ఆకసమించుక ధావళ్యమువహించి యుండెను. ఆమె యొకతీరుననే పత్వతశిఖరమునకు బోయెను. అక్కడ నిలిచిమరల "ప్రాణనాయకా! ఎచ్చటనున్నావు? నన్నిట్టి విషమపరీక్షకు లోనుగావించుట తగవుగాదు." అని యఱచెను. గొంతెత్తియేడ్చెను. కాని యామెది యరణ్యరోదనమయ్యెను. అంతక్రమముగా జంద్రుడుద యించుటయు దత్కి రణములు వృక్షాగ్రములును గొండ కొనలును నెక్కుటయు దటస్దించెను. వెన్నెలవెలుగు నకు గరంబు మఱుంగుచేసికొని గంగమ్మ యన్నిప్రకలం  గలయం జూచెను. ఎదుట నింకొకకొండయు, రెండు కొండలకును మధ్యమరొక ప్రవాహమును నామెకు గాన్పించెను. తానిందాక దరింపజాలకపోయిన యెఱదియే కాబోలు ననియు, దాను భర్తయొక్కిన కొండగాక వేఱొక కొండనెక్కితిననియు, నామెగ్రహింప గల్గెను. క్రమ్మఱ గంఠమెత్తి భర్తను బిలిచెను, ఆకొండమీద నాతడు కాన్పిచునేమోయని తన విశాల నయనముల నింకను నిశాంతరములు గావించి యరసెను. అప్పుడొక మూలుగు వినబడెను. ఆమె నాత్రముతో నారయ జొచ్చెను. తన కెదుటి కొండ చరియమీద నొకతరువును బట్టుకొని యొక మనుజుడు పండుకొనియున్నట్టులామెకు గోచర మయ్యెను. మఱియు బరికించి చూడ నామనుజుడు తొడిగికొన్న తెల్లనిచొక్కాయు గంగమ్మ కనిపెట్ట గల్గెను. తనభర్తయు నట్టిచొక్కాయనే