పుట:Goopa danpatulu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
164

గోపదంపతులు.

జేయుచున్నది. కాని యది9 నోరెఱుగని కూన యగుటచే, దానినేమనగలము? నేనుమాత్రమిక నీకడనుండజాలను. ప్రజలమొగములు చూడజాలను. నేనెందుపోయెద, నాకికబ్రపంచముతో బనియేలేదు.

    గంగ--అయ్యా! హృదయేశ్వరా! మీరేయెందేని పోయిన, నికనేనా? నాబిడ్దకిప్పుడు కొంచె మింగితము గలుచుచున్నది. ఇక నెవ్వరో దానిని గాపాడకపోరు. కావున నేను వెనుకటవత్తును. దయతో నారాకనుమతింపుడు. మిమ్మివిడిచి నేనుమనజాలను.
    అప్ప--అదివట్టిమాట, మూడేండ్లు మనలేదా?
    గంగ--నాచపలబుద్ది నన్నట్టు లీడ్చుకొనిపోయినది. అందునకు నేనుబడు తాపము నాహృదయమునకేగాని యొరులకెఱుకపడదు. మున్నెట్లు వర్చించినను, నిక ముందట్లు మీయెడబాటునుసహింపజాలను. మిమ్మువీడిన యుత్తరక్షణమున నేను గుండెవ్రాలజనిపోవుదును. నామాట నమ్ముడు. అది నిశ్చయము.
    అప్ప--నేనునమ్మను. ఇంకనీదారినీది. నాదారినాది.నాకు భగవంతుని యాహ్వానము వచ్చినది. అతడొనర్చు గంభీరవిషాణధ్వని నాకు విస్పస్టముగా వినబడుచున్నది. నేనిక బొవకతప్పదు.
    అని చివాలున నతడు వెనుకకు దిరిగియొక్క పరువున