పుట:Goopa danpatulu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

127

పునస్సమాగమము.

     ఈపలుకలువిని జానకియు దల్లియు జాల సంతసించిరి, అతని యుపదేశప్రకార మాచరింతుమని వాగ్దానముజేసితిరి. ఆమాటబుచ్చుకొని నటేశ మింటికి బోయెను. రామయ్య గంగమ్మను విసర్జించిన దాను గైకొనవచ్చునను దుర్బుద్దిచే తనే వా'డిట్టు లాయిల్లాలికి దోడ్పడుచుండెగాని సదుద్దేశముతోగాదు.
     రామయ్యచెట్టి గంగాబాయిమీద మొదటగల్గినంత వలపిప్పుడు లేదు. ఆమె గర్బవతిగానుండ 'మధురవాణి ' యనబడు వేశ్యతో నతడు చరించియుంట మున్నెఱింగింపబడెగదా? గంగమ్మకు బిడ్దపుట్టినతర్వాత దాని సంరక్షణమునకై కొంతకాలము వినియోగింపవలసి వచ్చుచుండెను. మునుపటివలె సర్వదా ప్రియునిచెంత గూర్చుండి యతని కింపునింప రనువుపడకుండెను. ఆయాయెడల రామయ్యకించుక నిర్వేదము గల్గుచుండెడిది. కాని మొదట దనహృదయవాటికను నాటుకొనియున్న గాటంబు నలపుటలుగును. బెఱుక నతనికి వశముగాక యెటులో తృప్తిపడుచుండువాడు. బిడ్డపుట్టినతర్వాత గంగాబాయి యొడలిగొలును నించుక తగ్గిపోవుటచేత రామయ్యకు మునుపటియంతటి మమకర మామెయందు గాన్పింపకుండెను. అది యప్రయత్నముగా నానాట క్షీణించుచుండె.
  ఎటులో బిడ్డకు రెండేండ్లు నిండువఱకు వారికాపురము జరిగిపోయెను. ఆవల గంగమ్మ మరల గర్భిణియ