పుట:Goopa danpatulu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
118

గోపదంపతులు.

చున్నదని మాదాది చెప్పుచున్నది. మీలొనెవ్వరేని వాని నెఱింగియుండురేని నాకు దెల్పిన, నేను వారిని దగినవిధముగా బహుకరింతును. నాబార్య వాని కాళ్ళ మీదబడి వాడేమికోరిన నది యిచ్చును.' ఈమాటలు వినియు దానే యారక్షకుడనని యెఱింగియు మన యప్పలసామి మాటాడకుండెను. ఆహా! యేమి వాని సౌశీల్యము! ఏమి వానియుపకారగుణౌన్నత్యము!

     పురుషులకిట్టివిందు తోటలో జరుగుచుండ భవన మందలి మధ్యాగారమున స్త్రీలకు గంగమ్మ మఱియొక విందు నడపెను. దాని విదుషీమణి యధ్యక్షత వహించెను.బిడ్డగంగమ్మ వలె సుందరియౌటచే నందఱు దానినెత్తుకొని ముద్దాడి దాని యాయురైశ్వర్యాభివృద్దికై ప్రార్దనలుజరిపిరి. వారిలొనెవ్వరును బురుషులుండు తావునకురాకుండుటచే నప్పలసామికి గంగమ్మ కనబడకుండెను. ఆమెయు బురుషులలొ దన మొదటి మగడు  కూర్చుండియున్నాడని యెఱుగకుండెను. ఆమెయాతనిని విస్మరించిన దనియే చెప్పవచ్చును.
    విందుముగిసెను. ఒక్కొక్కఘనుడేవచ్చి  రామయ్య కరముంబట్టి జాడించి యేగుచుండెను. దొరలు కొందఱు హిందువులుకొందఱు దప్పద్రావిన వారు లేవలేక తమ్ములేవదీయబోవు సేవకుల గొట్టుచు దిట్టుచు బొరలుచుండ నప్పలసామి వారిలో నొక్కొక్కరిని గట్టిగా బట్టుకొని వారివారిబండ్లలో