ఉండకూడదు - ఉంటే అరిష్టమట. అలాగే వీధి శూల కూడదంటారు. వీధి శూలంటే వీధిలో రోడ్ల ఆద్యంతాలకు అభిముఖంగా గుమ్మం ఉండరాదు - ఇది వినాశ హేతువట. వాడకంనీరు తూర్పు భాగాన తూములోంచి పోవాలి. అలా చేస్తే ధనాభివృద్ది అవుతుంది. మరుగుదొడ్డి దక్షిణ నైరుతీ భాగాల మధ్యగానె, అగ్నేయ దక్షిణ భాగాల మధ్యగాని ఉండాలి. అలా ఉంటే సర్వత్రా శ్రేయస్సు. ఈశాల్యం త్రెరిపి వుండాలి. అంటే ఈశాన్యమూల కప్పు లేకుండా ఉండాలన్నమాట. మూత వేస్తే ఆ కుటుంబం మసి అయిపోతుందట. ఇంటి నానుకొని ఖాళీస్థలం వదలడంళొ దక్షిణం కంటే ఉత్తర్ం ఎక్కువుండాలి. పడమర కంటే తూర్పు ఎక్కువుండాలి. సింహద్వారంతో మూడు వరుస గుమ్మాలుంటే శివదృష్టి- సర్వనాశనం అంటారు. గర్భంలో గుమ్మాలు ఎనిమిదిగాని, పన్నెండుగాని ఉండేటట్లు చేస్తారు. మొత్తంమెద స్వరూపాలు సరిసంఖ్యలో ఉండాలంటారు.
'గ్రహస్థితి కంటే గృహస్థితి గొప్పది ' - గ్రహస్థితి సరిలేకుంటేనష్టపోయేది ఆ ఒక్క వ్యక్తే. గృహస్థితి సరిలేకుంటే ఆ యింట్లో ఉన్న వారందరికీ నష్టంకలుగుతుందని వారి భావం. గృహనిర్మాణంలో 'విష్ణు వృష్టం, శివదృష్టి ' పనికి రావంటారు. - అంటే విష్ణాలయానికి వెనుక, శివాలయానికి ముందు ఉండే యిండ్లు శోభించవని, గృహచ్చిద్రాలు, దరిద్రంవంటివానితో సర్వనాశనం అవుతాయని అంటారు. అలాగే ధ్వజ స్తంభం నీడపడ్డ యిళ్ళుకూడా వృద్ధినొందవని చెబుతారు.వీరు నాగరికుల్లాగ ఫేషన్ కోసం కాకుండా గృహాలను ఉపయోగం కోసమే కడతారు. ఖర్చు తక్కువగా ఉండేటట్టు మట్టి, సున్నం, ఇటుక (పచ్చి యిటుకకూడా) వాడి ఎక్కువగా పెంకిటిళ్ళే కడతారు. మరీ పేదలు పూరి గుడిశలు తాటాకుతో నిర్మించుకుంటారు.
- "Folk Architecture may be said to be traditional Architecture. It is concerned with all traditional aspects of building, the shapes, sizes and Lay outs of building all "kinds"
- Warren E. Roberts, "Folk Lolorer Folk life" (Ed... Ridhard M. Dorsa) 28 p.
(ఆంధ్రుల జానపద విజ్ఞాణనం పు 424 నుండి గ్రహించబడింది)