పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చే త బ డి

జానపదులలో దీనిమీద విశ్వాసమెక్కువ . ఇది తంత్ర విద్యకు సంబంధించింది. తంత్ర విద్యంటే భూతాలు, దయ్యాలు, పిశాచాలకు సంబంధించిన విద్య. శత్రువును సాధించాలనుకున్నప్పుడు అతని నాశనాన్ని కోరుకుంటారు ఆ నాశనానికి అజ్ఞాతంగా చేసే ప్రక్రియే చేతబడి లేక ప్రయెగం . ఈతంత్ర శగ్తిగలవారు చాలా అరుదుగా ఉంటారు . ఇవి కొండదొరలు కూడా చేస్తారు.

ఎవరికైతే కీడు తలపెడతారో అతని తలవెంట్రుకగాని, గోరుగాని, మూత్రంగాని దొరికితే చాలు. దానితో ఈ ప్రయెగం చేస్తారు. ఆ మనిషి రూపుతో ఒక బొమ్మను చేసి ' అబ్రకదబ్రా ' వంటి మంత్రాలతో దాని తలమీదా, కాళ్ళమీదా ముళ్ళుగుచ్చి అతని నుండి సంపాదించగలిగిన తలవెంట్రుకగాని, మూత్రంగాని, గోరుగాని, మూత్రంకలిసిన మట్టిగాని దానికి కట్టి ఇంతకాలంలో ఆ వ్యక్తి చనిపోవాలని నిర్దేశించి దూరంగా శ్మశానంలో పాతిపెడతారు. వెంటనే అకారణంగా, అకస్మాత్తుగా ఆ వ్యక్తికి తలనొప్పి, కీళ్ళనొప్పి లాంటివి ప్రవేశించి క్రమంగా అనారోగ్యానికి లోనై పీడముఖం పడి ఆ నిర్దేశించిన సమయానికి చనిపోతాడు. అలా పీడముఖం పడుతుండడం గ్రహించిన కొందరు పెద్దలాళ్ళు అది చేతబడి అని భావించి ఒక తంత్రగాడిని ఆశ్రయిస్తారు. అతను రోగి స్థితి గ్రహించి అది చేతబడే అని నిర్ణయించి ఆ రోగిని గాని, రోగికి నమ్మకమైన వ్యక్తినిగాని అమావాస్యనాడు అర్ధరాత్రి చీకట్లో ఒక్కణ్ణీ రమ్మని, బొమ్మ పాతిబెట్టబడ్డ చోటికి తీసుకెళ్ళి వివస్త్రంగా త్రవ్వమంటారు. అలా త్రవ్వగా ముళ్ళుగ్రుచ్చ్జబడి మంత్రింపబడినబొమ్మ కనిపిస్తుంది. దానిని పైకి తీసి, ఆముళ్ళు వగైరాలు తోలగించి, మంత్రం జపించి, కొబ్బరికాయకొట్టి, ఆబొమ్మను నాశనం జేసేసి, రోగి స్తొమతను బట్టి సొమ్ము వసూలు చేసుకుంటాడు. క్రమంగా ఆ వ్యక్తికి ఆ జబ్బు తగ్గిపోతుంది. చేతబడి తీయడమనేది ఎక్కువగా ముస్లింలే జేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో దుళ్ళగ్రామంలో ఒక ముస్లిం ఈ విద్యలో ఆరితేరిన వానిగా ప్రసిద్ధి పొందాడు. దీర్ఘకాయిలా రోగులు చేతబడి అనుమానమొస్తే ఒక కొబ్బరికాయ తీసుకొని అతని యింటికి వెళ్ళితే అతను ఆకొబ్బరికాయ మన ఎదురుగానే ఒక