పుట:Gidugu Rammurthy Mundu matalu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రస్తావన

2005 ఆగస్టు 29వ తేదీని గిడుగు రామమూర్తి 143వ జయంతి సందర్భంగా సవర బులిటిన్ తొలిసంచికను విడుదల చేశాం. నాటినుండి అవిచ్చిన్నంగా ఒక సంవత్సరకాలం 11 సంచికలు నెల నెలా ప్రచురిస్తునే వచ్చాం. సవరలను విద్యావంతులను చెయ్యాలనే తాపత్రయంతో, వారు తమ మాతృభాషలో చదువుకోవడంకోసం సవరభాషలో కధలను, పాటలను తెలుగులిపిలో సవర బులిటన్ల ద్వారా అందించడం జరిగింది. వీటిని ఉపయోగించుకొన్నవారు వున్నారు. కాని ఈ పత్రిక తమ మాతృభాషలో చదువుకోవాలన్న ఆశగల సవరలందరికీ చేరలేదు. సవర కథల, పాటల తెలుగు అనువాదాలు చదువుకొని ఆనందించిన తెలుగువారు కొందరు సవరభాష నేర్చుకోవడానికి ఒక బోధనాగ్రంథం ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వారికోసం, సవర గ్రామాలలో పనిచేస్తూ సవర విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సవరభాష రాని "తెలుగు ఉపాధ్యాయుల కోసం “సవర నేర్చుకొందాం” సిధ్ధంగావుంది. పుస్తకం కొనేవారి సంఖ్య 400 లకు తగ్గితే అచ్చువేసి ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. అందుచేత ప్రస్తుతానికి గిడుగు రామమూర్తిగారి ముందుమాటలు ప్రచురిస్తున్నాం.

“ప్రజలు మాట్లాడుకొనే భాషలు ప్రపంచంలో 7000 వున్నాయి. వీటిలో ఏదో ఒకటి ప్రతి రెండువారాలకీ నశించిపోతుంది. ఇవి ముఖ్యంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, సైబీరియా, ఉత్తర అస్ట్రేలియాలలోని ఆదివాసీ భాషలు అంటూ 2007 సెప్టెంబరు 20 వ తేదీ హిందూలో “గ్లోబల్ హాట్ స్పాట్స్ ఆఫ్ ఎన్డేంజర్డు లాంగ్వేజస్" అని ఒక వార్త ప్రచురించారు. జీవద్భాషల సంస్థకు అసోసియేట్ డైరెక్టరు అయిన ప్రొ. కె. డేవిడ్ హారిసన్, “భాషలు నశించిపోవడానికి ముఖ్యకారణం ఆయాభాషలకు లిపి లేకపోవడం; ఆ భాషలలో గ్రంథాలు, నిఘంటువులు లేకపోవడం” అంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఒక భాష నశించిపోతే ఆ భాషతోపాటు ఆ భాషమాట్లాడేవారి నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, పురాణకథలు, వైద్యం, మందులు, మంత్రాలు, ఇంజనీరింగు, అన్నీ నశించి పోతాయి. ఇవన్నీ గ్రంథస్థం అయినప్పుడే వారి జ్ఞానాన్ని భావితరాలకి అందించగలం. సవరభాష నశించిపోకుండా ఆ భాషలో నిఘంటువులు, కథలు, పాటలు, సంభాషణలే కాదు ఆ భాషకొక వ్యాకరణం రాసి డేంజరులో పడిపోకుండా కాపాడిన మహానుభావుడు గిడుగు వెంకట రామమూర్తి.

“జాతి పునరుజ్జీవనం కోసం కృషి చేసిన వారిలో గిడుగు రామమూర్తిగారు అగ్రగణ్యులు. అనేక రంగాలలో తొలికృషి ఆయనదే. గిడుగువారి బహుముఖీనమైన