పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పులు కరగి కాలువల జాలువారకమున్నె, చుక్కలలోని చందురుకన్న నెక్కుడు బెట్టునరియు, నవురూపుడును, లోకాతీతుండును నగు నాదేవదేవునిపై వెఱ్ఱ్రిప్రేమ నించి ప్రణయసిద్ధి గాంచమి వేదన స్రుక్కుచు నాశల నల్లాడుచు, చింతాగానము జేయుచున్నది. "మండువేసవి విలపించు కొండసోన దీన గానమున కన్నను తీయనైన" యాపె విరహిగీతముల కవితా పరిపాకము ననుభవరసికులే యెఱింగి గ్రహింతురు గాక. "పురాణ మిత్యేవ న సాధు సర్వం, నచాపి కావ్యం నవ మిత్యవద్యం, సంత: పరీక్షాన్యతరత్ భజంతే, మూఢ: పరప్రత్యయనేయ బుద్ధి:" అను మహాకవి కాళిదాసువచనముల రసహృదయులగు పాఠకులు పాటింతురు గాక.

బసవరాజు వేంకట అప్పారావు.


____________