పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండుటాకులుఇ పాట పాడుతుండగ
చిట్టీ ! నీయేడ్పు విని దద్దరిల్లేను !
మడమటా సూర్యుండు కుంకేటి వేళా
సందెకాంతులు కళ్లపండ గౌవేళా
వికసించి నవ్వేటి బీరపువ్వులలో
చిరినవ్వునీమోము చూచి మురిసేను !
వెర్రిలోకము సద్దు మణిగిన్న వనక
మత్తన్ని మబ్బు పొత్తిళ్లలో వొదిగి
బజ్జుని మింట వుయ్యాల లూగేటి
చెంద్రుణ్ణి నీమేని పట్టబొయ్యేను !
మాయదారీ నిద్ర మచ్చుఒడిజల్లీ
మనసు గొని దివ్యలోకాలన్ని దిప్పి
తుదకు దయచేసింది నా చిన్నతల్లి !
నీసన్ని ధనియేటి నిర్వాణసుఖము !