పుట:Geetham Geetha Total.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత

పంచమాధ్యాయము.

కర్మసన్న్యాస యోగము


అర్జునుఁ డిట్లనియె :-

01. తే. కర్మసన్న్యాసము వచించి కమలనాభ !
కర్మ మొనరింపవలయు యోగమున కంటి;
రెంటియందును నా కెద్దిశ్రేష్ఠమగునొ
నిశ్చయముజేసి తెలుపుమీ నీ మతమును.

భగవంతుఁ డిట్లనియె :-

02. ఆ. కర్మయోగపథముఁ గర్మసన్న్యాసంబు
శ్రేయమే యొసంగు; రెంటియందు
జ్ఞానయోగి సేయు సన్న్యాసమునకంటెఁ
గర్మపథము మిగుల ఘనము పార్థ !

03. తే. ఎవ్వనికి లేవో ద్వేషంబులీప్సితంబు
లాతఁడే నిత్యసన్న్యాసియగును బార్థ !
ద్వంద్వములఁ ద్యాజ్య మొనరించువాఁడు సౌఖ్య
వంతుఁడగు; బంధనములచే బాధపడఁడు
.
04. తే. కర్మయోగంబు జ్ఞానయోగంబు వేఱు
వేఱటండ్రు బాలకులు; వివేకు లనరు.
రెంటియందును జక్కని రీతి దేని
నాచరించిన ఫలసిద్ధి యగును బార్థ!