పుట:Geetham Geetha Total.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

57. తే. ఎవఁడు సర్వత్ర స్నేహంబు నెదఁ దలఁపక
యంతకంతకుఁ గల్గు శుభాశుభముల
యెడల సంతోషదుఃఖంబులెల్ల విడుచు
నతనిప్రజ్ఞ ప్రతిష్ఠితంబగును బార్థ !

58. ఆ. కూర్మ మెట్లు ముడుచుకొనుఁ గరచరణంబు
లట్లె విషయసుఖములంటకుండ
మనుజుఁ డిరద్రియముల మరలింపవలయును;
అట్టివానిప్రజ్ఞ గట్టి దగును.

59. ఆ. అప్పుడిరద్రియములకాహారమైనట్టి
విషయసుఖము లెల్ల వీడిపోవు;
విషయరాగ మొకటి వీడకుండిన నుండు
నదియుఁ బరముఁ గనిన వదలుఁ బార్థ!

60. ఆ. జ్ఞానిjైునవాడు సర్వయత్నంబుల
సలువుచుండుఁగాని సవ్యసాచి !
అప్పటికిని నింద్రి యంబు లాతనిమన
స్సట్టు నిట్టు లాగు నతిబలమున.

61. తే. అట్టి యింద్రియంబుల నెల్ల నణచిఁవైచి
యుక్తుఁడగువాఁడు నా యందె యుంచు మనసు;
ఇంద్రియంబులు వశ్యంబులెవని కగునో
యతనిప్రజ్ఞ ప్రతిష్ఠితంబగుచు నుండు.

62. తే. విషయములచింతచే నుద్భవించుచుండు
వానియందలిసంగంబు మానవునకు;
సంగబలమునఁ గామంబు సంభవించు;
దానివలన జనించుఁ గ్రోధంబు పార్థ !










[[