పుట:Geetham Geetha Total.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36.కం. చవి గల్గు దేన నభ్యా
సవశంబున, దేన దుఃఖ`జాలము సమయున్‌,
ద్రివిధము లగుతత్సుఖములు
వివరించెద; శ్రద్ధఁ బూని వినుము కిరీటీ!

37. తే. మొదలఁ జూచిన, విషతుల్య మదియె తుదకు
నమృతతుల్యంబుగాఁదోఁచు నట్టి సుఖము
ఆత్మబుద్ధి ప్రసాదజన్యంబు, దాని
సాత్త్వికం బని పలుకంగఁ జనును బార్థ!

38. తే. ఇంద్రియంబులు విషయంబు లేక మగుట
నాదిదశయందు నమృతతుల్యముగఁదోఁచి
తుట్టతుద విషతుల్యమై తోఁచుసుఖము
రాజసం బనఁ జనుఁబాండు రాజతనయ!

39. తే. ఆదియందును నంత్యంబునందుఁ గూడ
నిద్రమాంద్ర మజాగ్రత్త నిండుకొనఁగ
మోహమున మానసంబును ముంచివైచు
సుఖమునకుఁ దామసాఖ్యయే సుప్రసిద్ధి.

40. తే. భువిని గలభూతముల మఱి దివిని సురల
యం దొకండేని ప్రకృతిజన్యంబు లైన
త్రిగుణములఁ బూర్తిగా విసర్జించినట్టి
సత్త్వమే లేదు, నిజమిది సవ్యసాచి!

49. తే. దేనియందును సంగంబులేనియట్లు
మనమును జయించి, స్పృహలను మానుజ్ఞాని
కర్మఁజేసియుఁ బొందు నైష్కర్మ్యసిద్ధి
సన్న్యసించినవాఁ డౌట సవ్యసాచి!